హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): కొత్త ఇంజినీరింగ్ కాలేజీ లు నెలకొల్పడం, ఇప్పటికే నడుస్తున్న కాలేజీలకు అనుబంధ గుర్తింపు పొడిగింపును అఖిల భారత సాంకేతిక వి ద్యామండలి(ఏఐసీటీఈ) ప్రారంభించింది. తెలంగాణలోని కాలేజీలు 25 నుంచి డిసెంబర్ 9 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆలస్యరుసుంతో జనవరి 18 నుంచి ఫిబ్రవరి 2 వరకు అవకాశమిచ్చారు. ఏఐసీటీఈ రాష్ర్టాలు, కాలేజీలను ఈ ఏడాది నాలుగు గ్రూ పులుగా విభజించగా.. తెలంగాణ గ్రూప్-2లో ఉంది.
ఒక డీఏతో నిరాశకు లోనయ్యాం: లక్ష్మయ్య
హైదరాబాద్, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ) : డీఏల కోసం ఆశగా వేచిచూసిన తాము ప్రభుత్వం ఒకే ఒక్క డీఏను ప్రకటించడంతో తీవ్ర నిరాశకు గురయ్యామని పెన్షనర్స్ జేఏసీ ప్రకటించింది. జేఏసీ సమావేశాన్ని మంగళవారం హైదరాబాద్‌లో నిర్వహించా రు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ కే లక్ష్మయ్య, సెక్రటరీ జనరల్ శుభాకర్‌రావు మాట్లాడుతూ నాలుగు డీఏలను విడుదల చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్‌ను, మెడికల్ బిల్లులను మంజూరుచేయాలని కోరారు