వచ్చేస్తున్నది.. సూదిలేని టీకా!
- కరోనా కట్టడికి ముక్కు టీకాలు
- సూది లేదు.. నొప్పి బాధ ఉండదు
- అతి తక్కువగా వ్యాక్సినేషన్ ఖర్చు
- ఎవరికివారు వేసుకొనే అవకాశం
- భారత్ బయోటెక్ క్లినికల్ ట్రయల్స్ మొదలు
- బిగ్ గేమ్‌చేంజర్ కాబోతుందన్న నీతి ఆయోగ్
హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): కొవిడ్ మహమ్మారికి కళ్లెం వేసేందుకు కొత్త తరహా టీకాలు రాబోతున్నాయి. ఇప్పటికే అందుబాటులోకి వచ్చిన టీకాలకంటే మరింత సామర్థ్యంతో, మరింత సులువుగా వేసే టీకాలు అతి త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి. వీటిపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు ఊపందుకొన్నాయి. హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ కొత్తరకం టీకా తయారీలో ముందున్నది. ఈ సంస్థ అభివృద్ధి చేసిన ముక్కు టీకాలు (ఇంట్రా నాసల్ కొవిడ్ వ్యాక్సిన్) ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఈ టీకా అభివృద్ధి, క్లినికల్ ట్రయల్స్ కోసం అమెరికాలోని వాషింగ్టన్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌తో భారత్ బయోటెక్ ఒప్పందం చేసుకొన్నది. దేశంలో ముక్కుటీకా క్లినికల్ ట్రయల్స్‌కు ఇప్పటికే డ్రగ్స్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతివ్వగా.. హైదరాబాద్, పాట్నా, చెన్నై, నాగ్‌పూర్‌లో తొలిదశ ప్రయోగాలు మొదలయ్యాయి. ఈ టీకా (బీబీవీ154-అడెనోవైస్ వెక్టార్డ్ ఇంట్రానాసల్ వ్యాక్సిన్)ను వలంటీర్లకు ఇచ్చి ఫలితాలను విశ్లేషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాను నియంత్రించటంలో ముక్కుటీకా బిగ్ గేమ్ చేంజర్ కాబోతున్నదని నీతి ఆయోగ్ పేర్కొనటం విశేషం.
ఏమిటీ ముక్కు టీకా?
టీకాలు ఇచ్చే విధానాన్ని బట్టి పలు రకాలుగా ఉంటాయి. చాలా టీకాలు సూదుల ద్వారా శరీరంలోకి చొప్పిస్తారు. వీటిని ఇంట్రా మస్క్యులర్ అంటారు. కొన్ని చర్మం, కండరం మధ్యలో ఇస్తారు. వీటిని సబ్కటానియస్ అంటారు. పిల్లలకు ఇచ్చే పోలియో టీకాలను చుక్కల రూపంలో నోటిలో వేస్తారు. మరికొన్ని టీకాలను ముక్కులో కండరాలపై స్ప్రే చేస్తారు. వీటిని ఇంట్రానాసల్ అంటారు. భారత్ బయోటెక్ ఇప్పుడు ఇంట్రానాసల్ టీకాపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తున్నది. వీటిని వందకోట్ల డోసులు ఉత్పత్తి చేస్తామని ప్రకటించింది.
ఎలా పని చేస్తుంది?
ఈ టీకాలను ముక్కు రంధ్రాల్లో వేస్తారు. లేదంటే స్ప్రే చేస్తారు. వెంటనే అది ముక్కు కండరాల్లో వ్యాపిస్తుంది. మ్యూకస్ మెంబ్రిన్ను వేగంగా శోషించి రక్తంలో వ్యాధినిరోధకశక్తి ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. వ్యాధి నిరోధక కణాలు (టీ సెల్స్) ముక్కు, నోరు, ఊపిరితిత్తుల్లో ఏర్పడతాయి. వైరస్ శరీరంలోకి ప్రవేశించగానే గుర్తించి చంపివేస్తాయి. సూది ద్వారా వేసే టీకాలకంటే ముక్కు టీకాలు మెరుగైనవని చెప్తున్నారు. ఇవి శరీరంలో రోగనిరోధకతను పెంచటంతోపాటు వైరస్ శరీరంలోకి ప్రవేశించే మార్గంలోనే అడ్డుకొంటుంది.
ఎవరికివారే వేసుకోవచ్చు
సూదిద్వారా శరీరంలోకి చొప్పించే కొవిడ్ టీకాలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వీటిని వేయటం సవాల్‌తో కూడుకున్నది. శిక్షణ పొందిన వైద్యులు, నర్సులు ఉండాలి. సిరంజీలు, సూదులు పెద్ద సంఖ్యలో అవసరం. ముక్కు టీకా వల్ల ఈ సమస్యలన్నీ తొలగిపోనున్నాయి. ముక్కు టీకా వేయటం చాలాతేలిక. శిక్షణ పొందిన వైద్య సిబ్బంది అవసరం లేదు. వ్యక్తులు ఎవరికివారు సొంతంగా కూడా వీటిని వేసుకోవచ్చు. ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు ఉండే మంట, దద్దుర్లు, ఇతర ఇన్ఫెక్షన్ల బాధను ముక్కుటీకా దూరం చేయనున్నది. ఈ టీకా వల్ల పెద్ద మొత్తంలో ఖర్చు కూడా ఆదా అవుతుంది.
మంచి ఎంపిక
ముక్కు టీకా కోసం వాషింగ్టన్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ మెడిసిన్‌తో కలిసి పనిచేస్తున్నాం. ఇప్పటివరకు జరిపిన పరిశోధనల్లో ఇది మంచి ఫలితాలిచ్చింది. ఈ టీకా మంచి ఎంపిక కాబోతున్నది. ప్రపంచం మొత్తం ముక్కు టీకాల కోసం ఎదురుచూస్తున్నది. ఈ ఎదురు చూపులకు భారత్ బయోటెక్ త్వరలోనే పరిష్కారం చూపుతుంది. – డాక్టర్ కృష్ణ ఎల్లా, భారత్ బయోటెక్ ఎండీ
చాలా సులువైన విధానం
కొవిడ్ టీకాను ముక్కు ద్వారా ఇవ్వడం అత్యంత తేలికైన విధానం. ఆశా వర్కర్లకు శిక్షణ ఇచ్చి కూడా పంపిణీ చేయొచ్చు. కండారాలకు అయితే నిపుణులైన వైద్యులు, నర్సులు ఇవ్వాలి. కానీ ముక్కు టీకాలకు ఆ అవసరం లేదు.
– కిరణ్ మజుందార్ షా, బయోకాన్ ఈడీ
రాష్ట్రంలో కొత్త కేసులు 204
హైదరాబాద్, మార్చి 16(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సోమవారం 60,263 మందికి కరో నా పరీక్షలు చేయగా.. 204 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిం ది. 170 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ఇద్దరు మరణించారు.
బులిటెన్‌లో పేర్కొన్న వివరాలు
అంశం సోమవారం మొత్తం
కేసులు 204 3,01,522
రికవరీ 170 2,97,851
మరణాలు 2 1,656
యాక్టివ్ కేసులు – 2,015
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Five Of A Family Found Dead | తల్లి, భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. రైలు ముందు దూకి వ్యక్తి ఆత్మహత్య
Stock Markets | భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఏకంగా రూ.7 లక్షల కోట్లు పెరిగిన మదుపర్ల సంపద..!
Sailesh Kolanu | తుఫాను బాధితులకు అండగా శైలేష్ కొలను.. క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు, నెటిజన్ల ప్రశంసలు!
ISRO Jobs | ఇస్రోలో 61 టెక్నీషియన్-బి, డ్రైవర్ పోస్టులు.. నవంబర్ 13 చివరితేదీ
‘కోతుల బెడదకు శాశ్వత పరిష్కారం చూపాలి’
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

