హైదరాబాద్, జాన్ 14 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లోని దుండిగల్‌లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీ (AFA)లోని 215 కోర్సుకు సంబంధించిన కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్ (CGP) శనివారం విజయవంతంగా జరిగింది. భారత వైమానిక దళం (IAF)లోని వివిధ శాఖలలో ఫ్లైట్ క్యాడెట్ల ప్రీ-కమిషనింగ్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేశారు. 254 మంది గ్రాడ్యుయేషన్ క్యాడెట్ లతో పరేడ్ నిర్వహించారు. ఎయిర్ స్టాఫ్ చీఫ్ (CAS) ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ ఈ కవాతును సమీక్షించి క్యాడెట్ల నుంచి గౌరవవందనం స్వీకరించారు.
ఈ వేడుకలో, గ్రాడ్యుయేటింగ్ ట్రైనీలకు ఏపీ సింగ్ ‘ప్రెసిడెంట్స్ కమిషన్’ను ప్రదానం చేశారు. ఈ వేడుకలో ఐఏఎఫ్ ఫ్లైట్ క్యాడెట్లు, భారత నావికాదళం, భారత కోస్ట్ గార్డ్ అధికారులు, ఒక విదేశీ అధికారికి శిక్షణ విజయవంతంగా పూర్తయిన సందర్భంగా ‘వింగ్స్‘ ప్రదానం చేశారు. ఫ్లయింగ్ బ్రాంచ్ నుంచి ఫ్లైట్ క్యాడెట్, మెరిట్ ప్రకారం మొదటి స్థానంలో నిలిచిన వ్యక్తికి ‘ప్రెసిడెంట్స్ ప్లేక్’, ‘చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్ స్వోర్డ్ ఆఫ్ ఆనర్’ ప్రదానం చేశారు. గ్రౌండ్ డ్యూటీలో మెరిట్ క్రమంలో మొదటి స్థానంలో నిలిచిన ఫ్లైట్ క్యాడెట్‌కు ప్రెసిడెంట్స్ ప్లేక్‌ను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వైమానిక విన్యాసాలు ఆకట్టుకున్నాయి.