మునగనూర్‌లో ప్రభుత్వ భూములకు కంచె
రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా నుంచి కాపాడేందుకు అధికారులు ముందుకొచ్చారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మునగనూర్‌లో ప్రభు త్వ భూమిని సర్వే నంబర్‌ను ఏమార్చి సబ్‌డివిజన్ పేరుతో కొందరు వ్యక్తులు కాజేయాలని చూశారు. రెవెన్యూ అధికారులు ఏకంగా నా లా చెల్లింపులు జరిపించారు
-
పనులు ప్రారంభించిన అధికారులు
-
కలెక్టర్ ఆదేశాలతో భూమికి రక్షణ
-
‘నమస్తే’ కథనానికి స్పందన
రంగారెడ్డి/తుర్కయంజాల్, నవంబర్ 7: రూ.200 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కబ్జా నుంచి కాపాడేందుకు అధికారులు ముందుకొచ్చారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం మునగనూర్‌లో ప్రభు త్వ భూమిని సర్వే నంబర్‌ను ఏమార్చి సబ్‌డివిజన్ పేరుతో కొందరు వ్యక్తులు కాజేయాలని చూశారు. రెవెన్యూ అధికారులు ఏకంగా నా లా చెల్లింపులు జరిపించారు. సదరు భూమి లో భారీ అపార్ట్మెంట్లు, విల్లాల నిర్మాణం కోసం హెచ్ఎండీఏ నుంచి అనుమతులు పొం దేందుకు తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నారు.
ఇదే విషయమై ‘200 కోట్ల భూమేతకు ‘బిగ్’ స్కెచ్!’ శీర్షికన శనివారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఇన్చా ర్జి తహసీల్దార్ వేణు తమ సిబ్బంది, పోలీసులతో కలిసి శనివారం సాయంత్రం 12 ఎకరాల వివాదాస్పద భూమి చుట్టూ ఫెన్సింగ్ వేయించారు. రెవెన్యూ అధికారుల చర్యలతో స్థానికులు హర్షం వ్యక్తంచేశారు. భవిష్యత్‌లోనూ ఈ భూమిని కాజేసేందుకు ప్రయత్నిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇన్చార్జి తహసీల్దార్ వేణు హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

