హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): 2022 సీజన్లో బీడీ ఆకుల సేకరణ, వాణిజ్య నియంత్రణ కోసం రాష్ట్ర అటవీశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని 30 జిల్లాలు, 37 డివిజన్లలో బీడీ ఆకుల సేకరణకు స్టేట్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌ను నోడల్ ఏజెన్సీగా నియమించింది. బీడీ ఆకుల సేకరణకు సంబంధించి చెక్కు డ్రాయింగ్ అధికారాలను అటవీ అధికారులకు కల్పించారు. ఈ మేరకు మంగళవారం అటవీశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి ఏ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 2022 సీజన్లో 242 బీఎల్ యూనిట్ల బీడీ ఆకులను సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఒక్క బీఎల్‌లో 1000 ఎస్బీలు, ఒక్కొక్క ఎస్బీలో 50 ఆకులతో కూడిన 1,000 బండిళ్లు ఉంటాయి.