శనివారం 26 సెప్టెంబర్ 2020
Telangana - Sep 16, 2020 , 17:16:47

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు

సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి హరీశ్ రావు

సిద్దిపేట : సీఎం రిలీఫ్‌ ఫండ్‌ నిరుపేదలకు ఓ వరమని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేటలోని తన నివాసంలో నియోజకవర్గ పరిధిలోని 63 మంది లబ్ధిదారులకు రూ.15 లక్షల 66 వేల 500 విలువ గల చెక్కులు పంపిణీ చేశారు. సిద్దిపేట పట్టణానికి చెందిన 26 మందికి రూ.6 లక్షల 75 వేల 500, సిద్దిపేట రూరల్‌ మండలానికి చెందిన 10 మందికి రూ.2 లక్షల 37 వేలు, సిద్దిపేట అర్బన్‌ మండలానికి చెందిన 4 గురికి రూ.1 లక్షా 5 వేల 500, చిన్నకోడూరు మండలంలోని 7 మందికి రూ.2 లక్షల 12 వేలు, నంగునూరు మండలంలోని 10 మందికి రూ.2 లక్షల 43 వేల 500, నారాయణరావుపేట మండలంలోని 6 మందికి 93 వేల చొప్పున మొత్తం రూ.15 లక్షల 66 వేల 500 మంజూరైనట్లు మంత్రి వెల్లడించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు అండగా నిలుస్తుందని చెప్పడానికి సిద్దిపేట నియోజకవర్గమే నిదర్శనమన్నారు. లబ్ధిదారులు వెంటనే తమ బ్యాంకు ఖాతాలో జమ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సుడా చైర్మన్‌ రవీందర్‌రెడ్డి, పలువురు కౌన్సిలర్లు, ఆయా మండలాల ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. logo