Lagcherla | గిరిజన, దళిత పేద రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ చేసిన పోరాటంతో రేవంత్ రెడ్డి సర్కార్ దిగొచ్చింది. లగచర్ల భూసేకరణను నిలిపివేసింది. ఈ మేరకు శుక్రవారం నాడు ఒక ప్రకటన విడుదల చేసింది.
లగచర్ల ఫార్మాపై అభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్, అధికారులపై రైతుల దాడి ఘటనను ముందుగా పసిగట్టలేకపోవడం నిఘా వైఫల్యమేనన్న విమర్శలు వెల్లువెత్తాయి. లగచర్ల ఘటన అనంతరం అరెస్టులు, పోలీసుల మోహరింపులతో పరిస్థితి ఇంకా ఉద్రిక్తంగానే ఉన్నది. అర్ధరాత్రి వేళ రేవంత్ సర్కార్ అండతో పోలీసులు చేసిన దమనకాండతో రాష్ట్రం అట్టుడికింది. దీంతో బాధితులకు బీఆర్ఎస్ అండగా నిలిచింది. వారిని జాతీయ మానవ హక్కుల కమిషన్ దగ్గర వరకూ తీసుకెళ్లింది. ఈ క్రమంలోనే ఎన్హెచ్ఆర్సీ దీనిపై విచారణ కూడా చేపట్టింది. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తగ్గడం గమనార్హం.
Lagcherla