Madhusudana Chary | కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహి.. రేవంత్‌ది సర్వ భ్రష్ట ప్రభుత్వం : మధుసూదనా చారి
Madhusudana Chary | చైతన్యవంతమైన బీసీ సమాజమే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనే సదుద్దేశంతో అప్పటి మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో ఆత్మగౌరవ భవనాల కోసం స్థలాలు ఇవ్వడం జరిగిందని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి అన్నారు.
Madhusudana Chary | తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో కేసీఆర్ పిలుపు మేరకు బీసీ జాతి మొత్తం స్పందించి తెలంగాణ రాష్ట్రం సాకారం కావడానికి కారణబూతమైందని శాసన మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనా చారి అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడాలి.. బీసీలు అన్ని రకాలుగా ఎదగాలి.. బీసీలకు బ్రహ్మాండమైన వేదికలుండాలి.. చైతన్యవంతమైన బీసీ సమాజమే రాష్ట్రానికి శ్రీరామ రక్ష అనే సదుద్దేశంతో అప్పటి మంత్రి గంగుల కమలాకర్ నేతృత్వంలో ఆత్మగౌరవ భవనాల కోసం స్థలాలు ఇవ్వడం జరిగిందన్నారు.
ఈ ప్రభుత్వం గడిచిన అనేక దశాబ్ధాలుగా.. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ.. ఈ రోజు జరుగుతున్న పరిణామాల పరంపరలో కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహి అని మధుసూదనా చారి ఫైర్ అయ్యారు. కారణమేంటంటే మేం గతంలో శాసనసభ్యులుగా కొనసాగినప్పుడు, రాజకీయాల్లో ఉన్నప్పుడు బీసీల విషయాల్లో గతంలో ఉన్న ప్రభుత్వాలను 500 గజాలు, 1000 గజాలు బీసీల కోసం తీసి భవనాల కోసం కేటాయించండి అని అనేక దశాబ్ధాల పాటు ప్రభుత్వాల దృష్టికి తీసుకొచ్చినా ఏ రోజూ కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించిన దాఖలాలు లేవు. దానికి భిన్నంగా ఈ రోజు ఆత్మగౌరవ భవనాల కోసం ఆ కులం జనాభా దామాషాకు అనుగుణంగా 2 ఎకరాలు, 3 ఎకరాలు, 5 ఎకరాలు, 10 ఎకరాలు స్థలాలు కేటాయిస్తే.. ఈ భవనాల నిర్మాణం జరిగితే ఇవి వారి వేదికలుగా తయారై వారు సంఘటితం కావడానికి, శక్తిగా ఎదగడానికి ప్రభుత్వాలు చేస్తున్న దుర్మార్గాన్ని ప్రశ్నించేట్వంటి వేదికలుగా తయారవుతాయి కాబట్టి అది జరుగకూడదనే కుట్రతో చేసిన దుర్మార్గపు నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
3 సంత్సరాలుగా రాష్ట్రంలో కొనసాగుతున్నది సర్వ భ్రష్ట ప్రభుత్వమని మండిపడ్డారు. కారణమేంటంటే ఇక్కడ కృష్ణా, గోదావరి నదులున్నా అనేక వేల టీఎంసీల వర్షం కురుస్తున్నా.. ఆ కురిసిన నీళ్లను ఒడిసి పట్టుకొని సద్వినియోగం చేసే ప్రాజెక్టుల నిర్మాణం జరిగినా వాటిని సద్వినియోగం చేసేటట్వంటి ఆలోచన కానీ, అవగాహన కానీ లేదన్నారు.
LIVE: తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల మీడియా సమావేశం https://t.co/kN9NbtI6IW
— BRS Party (@BRSparty) November 5, 2026
Read Also :
DMHO Narendra Rathod | వైద్యసేవలో ఆటంకాలు లేకుండా సేవలు అందించాలి : డీఎంహెచ్‌వో నరేందర్ రాథోడ్
Dharmaram | లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ధర్మారంలో షుగర్ నిర్దారణ పరీక్షలు
Regina Cassandra | దక్షిణాది సినిమాలపై బాలీవుడ్ నటుల విమర్శలు సరికాదు: రెజీనా కసాండ్రా!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhusudana Chary | కాంగ్రెస్ పార్టీ బీసీల ద్రోహి.. రేవంత్‌ది సర్వ భ్రష్ట ప్రభుత్వం : మధుసూదనా చారి
Cristiano Ronaldo | ఇంటర్నేషనల్ కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన క్రిస్టియానో రొనాల్డో..!
పెన్షనర్లకు సీఎంపీఎఫ్ సాంకేతిక వెసులుబాటు
Amit Shah | చర్చ వీధుల్లో కాదు పార్లమెంట్లో పెట్టాలి.. రాహుల్‌గాంధీకి అమిత్ షా కౌంటర్
ACB NET | లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ జిల్లా యువజన అధికారి
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

