హైదరాబాద్, సెప్టెంబర్ 21 (నమస్తేతెలంగాణ): వరల్డ్ బ్యాంకు సౌత్ ఏసియన్ వైస్ చైర్మన్ మార్టిన్ రైజర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం శనివారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిసింది. గత నెలలో సీఎం రేవంత్ అమెరికా పర్యటనలో భాగంగా వరల్ట్ బ్యాంక్ చైర్మన్ అజయ్ బంగాతో భేటీ అయిన నేపథ్యంలో తదుపరి చర్చల కోసం తాజాగా ఆ బృందం సీఎంను కలిసింది.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పట్టణ మౌలిక వసతుల అభివృద్ధి, విద్య, వైద్యరంగాలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని వారికి వివరించారు. తమ సర్కారు చేపట్టిన ప్రాజెక్టులకు ఆర్థిక సహకారం అందించాలని కోరారు. ఇందుకు వారు కూడా సానుకూలంగా స్పందించారు. సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎస్ శాంతికుమార్, ముఖ్యమంత్రి ఆఫీసు ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, ప్రత్యేక కార్యదర్శి అజిత్‌రెడ్డి ఇతర ఉననతాధికారులు పాల్గొన్నారు.