MLC Dasoju Shravan Kumar | సీఎం రేవంత్ రెడ్డిని కేంద్ర విదేశాంగ శాఖ అవమానించింది.. లండన్‌కు పర్మిషన్ ఇచ్చారు. కానీ అమెరికాకు వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వలేదు. గతంలో ఏ ముఖ్యమంత్రికి ఈ విధంగా జరగలేదు. ఇది రేవంత్ రెడ్డికి చెంప పెట్టు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు అవమానం అని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్‌కుమార్ అన్నారు. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో దాసోజు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. కేంద్ర విదేశాంగ శాఖ పర్మిషన్ ఇవ్వని విధంగా తప్పుడు నిర్ణయాలు ఏం తీసుకున్నారో బయట పెట్టాలి.
రేవంత్ రెడ్డి ఏం తప్పు చేస్తారని కేంద్ర విదేశాంగ శాఖకు తెలిసింది.. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి,కేంద్రం ఇద్దరు సమాధానం చెప్పాలన్నారు..రేవంత్ రెడ్డి షెడ్యూల్ లో ఏం తప్పులు ఉన్నాయో తెలంగాణ ప్రజలకు చెప్పాలి.. రేవంత్ రెడ్డి పై కేంద్రం ఆరోపణలు చేసి అమెరికా పర్యటనను రద్దు చేసింది.. సందర్భం కాని పనులు సీఎం రేవంత్ రెడ్డి ఏం చేద్దామని అనుకున్నారని అడిగారు. సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యాలకు వ్యతిరేకంగా షెడ్యూల్ ఉందా..? రేవంత్ రెడ్డి తన సీఎం పదవికి తగని విధంగా పనులు చేస్తున్నారని కేంద్రం చెప్పకనే చెప్పింది.
సీఎం రేవంత్ రెడ్డి మనకు తెలియని విషయాన్ని అమెరికాలో చేస్తున్నారు . ఆ విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి,కేంద్రం ఇద్దరూ దాస్తున్నారు. ఏ కారణాలతో రేవంత్ రెడ్డిని ఆపారో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ట్రంప్‌కు వ్యతిరేకంగా ఉన్న న్యూయార్క్ మేయర్ మందాని ను కలవడానికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తే ఆపారని అంటున్నారు. రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా అందానీ కోసం పోవాలనుకున్నారా..? లేక న్యూ యార్క్ మేయర్ మందాని కోసం పోవాలనుకున్నారా..?ఆగస్టు 27,28 వ తేదీన రేవంత్ రెడ్డి షెడ్యూల్ లో ఎవరిని కలుస్తున్నారో వారి పేర్లు లేవు. రేవంత్ రెడ్డి విదేశాల్లో హవాలా చేస్తున్నారని.. బీజేపీ నేతలు అంటున్నారు.
పర్యటన రద్దు వెనుక ఏం జరిగిందో చెప్పాలి…
ప్రభుత్వంలో ఉన్న పెద్దలు బిట్ కాయిన్స్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. రేవంత్ రెడ్డి ఏం పాలసీలు స్టడీ చేయడానికి యూనివర్సిటీలకు వెళ్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన పర్యటనలో ఏదో సమాచారాన్ని దాస్తున్నారు. దీనిపై రేవంత్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. రేవంత్ రెడ్డిని అమెరికాకు ఎవరు ఆహ్వానించారు..బోస్టన్,న్యూ యార్క్ లో సీఎం రేవంత్ రెడ్డి ఎవరిని కలవాలని అనుకున్నారు..
న్యూయార్క్ మేయర్ మందానీ సంఘ విద్రోహ శక్తి కాదు.. ఆయన్ను కలిస్తే మాకు అభ్యంతరం లేదు. మందానీని కలవాలని అనుకుంటే సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్లో ఎందుకు లేదు.. రేవంత్ రెడ్డి పర్మిషన్ ఎందుకు రద్దు చేశారో కేంద్ర విదేశాంగ శాఖ సమాధానం చెప్పాలని దాసోజు డిమాండ్ చేశారు. లేకపోతే ఇద్దరూ కలిసి డ్రామాలు ఆడుతున్నట్లు భావిస్తామన్నారు. 2024లో రేవంత్ రెడ్డి పర్యటనకు పర్మిషన్ ఇచ్చి 2026లో ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. రేవంత్ రెడ్డి స్వంత పెట్టుబడులు పెట్టడానికి వెళ్ళారా లేక రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికి వెళ్లారా…?
రేవంత్ రెడ్డి నిజాయితీ పరుడు అయితే తన పర్యటన రద్దు వెనుక ఏం జరిగిందో చెప్పాలని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్‌కుమార్ డిమాండ్ చేశారు.రేవంత్ రెడ్డి నోట్ల కట్టలతో తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చాలని చూశారు. రేవంత్ రెడ్డి ట్రంప్ పేరును హైదరాబాద్ లో రోడ్డుకు పెట్టారు. రేవంత్ రెడ్డి అమెరికా వెళ్లి ట్రంప్ తో కలిసి మోదీ ప్రభుత్వాన్ని కూల్చుతారని భావించారా…? హరీష్ రావు దేవుడు గుళ్లకు వెళ్తే వివరాలు ఎందుకు చెప్పలేదు అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు..
తాను విదేశాలకు వెళ్ళినపుడు ఎవరినెవరిని కలుస్తారన్నది రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పరు ?.. గురివింద సామెతలా ఎందుకు రేవంత్ ఎందుకు ప్రవర్తిస్తున్నారు..?ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు చెప్పడం లేదు..రేవంత్ రెడ్డి పర్యటన రద్దుపై కేంద్ర విదేశాంగ శాఖకు లెటర్ రాస్తాం. రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీల వకాల్తా ఎందుకు..? రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్తున్నారో కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం బయటపెట్టాలని డిమాండ్ చేశారు.
Smart ration cards | తప్పులతడకగా స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ.. హరిపురంలో కార్డుల పంపిణీ నిలిపివేత