డ్రగ్స్‌పై వీడియోలు ప్రదర్శిస్తేనే షూటింగ్‌లకు అనుమతి
డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలు, అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకునే విధానాలపై సినీ పరిశ్రమ 1-2 నిమిషాల నిడివిగల వీడియోలను రూపొందించి, సినిమా ప్రదర్శనకుముందు థియేటర్లలో ప్రదర్శించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు.
- సినీ పరిశ్రమకు సీఎం రేవంత్ హెచ్చరిక
- మీడియా కూడా డ్రగ్స్‌పై దృష్టి పెట్టాలి
- డ్రగ్స్ అంటే వెన్నులో వణుకు పుట్టాలి
- సైబర్, టీన్యాబ్ వాహనాల ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి
హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే అనర్థాలు, అత్యాశకు పోయి సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకునే విధానాలపై సినీ పరిశ్రమ 1-2 నిమిషాల నిడివిగల వీడియోలను రూపొందించి, సినిమా ప్రదర్శనకుముందు థియేటర్లలో ప్రదర్శించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. లేకపోతే షూటింగ్‌లు, టికెట్ ధరల పెంపునకు అనుమతులు ఇవ్వబోమని స్పష్టం చేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సైబర్ సెక్యూరిటీ బ్యూరో, యాంటీ నార్కోటిక్ బ్యూరోలు కొనుగోలు చేసిన 155 వాహనాలను ఆయన ప్రారంభించారు.
అనంతరం మాట్లాడుతూ డ్రగ్స్, సైబర్ నేరాలను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని, అందుకోసం ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా విస్తృత ప్రచారం చేయాలని కోరారు. డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమంలో భాగస్వామి అయిన మెగాస్టార్ చిరంజీవిని ప్రత్యేకంగా అభినందించారు. ఆయనలా హీరో, హీరోయిన్లు స్వచ్ఛందంగా ముందుకొచ్చి పౌరులకు అవగాహన కల్పించాలని కోరారు.
రాజకీయాలపై మీడియా ఫోకస్ తగ్గించాలి
మీడియా ఫోకస్ రాజకీయ అంశాలకే పరిమితం కాకూడదని, డ్రగ్స్, సైబర్ నేరాలపైనా దృష్టిసారించాలని రేవంత్‌రెడ్డి సూచించారు. ఈ యజ్ఞం విజయవంతమయ్యేందుకు పౌరసంబంధాలశాఖ, పోలీసు, ఎక్సైజ్, ఫైర్, థియేటర్ యజమానులు, సినిమా ప్రముఖులు, మీడియా ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. డ్రగ్స్, సైబర్ నేరాలపై చిత్తశుద్ధితో పనిచేసే పోలీసులకు పదోన్నతులు, రివార్డులు ఇస్తామని తెలిపారు.
డ్రగ్స్, సైబర్ నేరాలు ప్రపంచ సమస్య
ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య సైబర్ క్రైమ్స్, డ్రగ్సేనని సీఎం తెలిపారు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన నేరాలు, చిన్నారులపై అఘాయిత్యాలు డ్రగ్స్ మత్తులో జరిగినవేనని పేర్కొన్నారు. ఉద్యమాలకు కేరాఫ్‌గా ఉన్న తెలంగాణ డ్రగ్స్‌కు బానిస కావొద్దని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీజీపీ రవిగుప్తా, హోంశాఖ కార్యదర్శి డాక్టర్ జితేందర్, ఏడీజీలు శిఖాగోయెల్, డీజీ (రిటైర్డ్) సందీప్‌శాండిల్య, ట్రై కమిషనరేట్ల సీపీలు కొత్తకోట శ్రీనివాసరెడ్డి, తరుణ్‌జోషీ, అవినాశ్ మొహంతి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అది నా బాధ్యత: చిరంజీవి
డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియోను విడుదల చేయడాన్ని సీఎం అభినందించినట్టు పోలీసు శాఖ ఎక్స్‌లో తెలిపింది. దీనికి స్పందించిన చిరంజీవి ‘ధన్యవాదాలు రేవంత్‌రెడ్డిగారు.. డ్రగ్స్ నిర్మూలన విషయాన్ని ప్రజలకు తెలపడం నా బాధ్యత’ అంటూ రీపోస్ట్ చేశారు. ఇదే అంశంపై హీరో మోహన్‌బాబు స్పందిస్తూ.. చలనచిత్ర నటులు 1-2 నిమిషాల నిడివిలో వీడియో చేసి ప్రభుత్వానికి పంపమన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunny Deol | వివాదంలో సన్నీ డియోల్ ‘సూర్య’ సినిమా.. బ్యాన్ చేయాలంటూ వైద్యుల డిమాండ్!
Krithi Shetty | పింక్ డ్రెస్‌లో కృతి శెట్టి.. క్యూట్ లుక్స్‌తో కట్టిపడేస్తున్న బేబమ్మ!
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ బ్యాటింగ్ పొజిషన్లో మార్పు
హయత్‌నగర్‌లో భూసేకరణపై ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు
NZvIND: న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్.. ఇండియన్ జట్టులోకి సూర్యవంశీ
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

