CM KCR | మహారాష్ట్ర తుల్జాపూర్లో కొలువైన తుల్జా భవానీ అమ్మవారిని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మంగళవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయం వద్ద అధికారులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలో భవానీ అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా ఆయనకు అర్చకులు ఆశ్వీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
అంతకు ముందు సీఎం కేసీఆర్ సర్కోలిలో జరిగిన బీఆర్ఎస్ సభలో పాల్గొన్నారు. అక్కడి నుంచి తుల్జాపూర్ ఆలయానికి చేరుకున్నారు. ఉదయం పండరీపురంలోని రుక్మిణీ సమేత విఠలేశ్వరస్వామి వారలను దర్శించుకొని, పట్టువస్త్రాలను సమర్పించారు. ముఖ్యమంత్రి వెంట మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్ ఉన్నారు.