హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ( CM KCR ), ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇద్దరూ ఇవాళ హైదరాబాద్‌లో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి మనవరాలి వివాహ వేడుకకు హాజరయ్యారు. పోచారం మనవరాలిని ఏపీ సీఎం జగన్ ఓఎస్డీ పీ కృష్ణమోహన్‌రెడ్డి కుమారుడికి ఇచ్చి వివాహం జరిపించారు. దాంతో శంషాబాద్ అవుటర్ రింగ్ రోడ్డులోని వీఎన్ఆర్ ఫార్మ్స్‌లో జరిగిన ఈ వివాహ వేడుకలో ఇద్దరు సీఎంలు కలిశారు. ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని వివాహ తంతును వీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రులిద్దరూ కాసేపు ముచ్చటించుకున్నారు. అనంతరం వరుడు రోహిత్ రెడ్డి, వధువు స్నిగ్ధ రెడ్డిలను ఆశీర్వదించారు.