NEET | నీట్లో గిరిజన విద్యార్థుల సత్తా.. ఒకే ఇంట్లో ముగ్గురికి మెడికల్ సీట్లు
సీఎం కేసీఆర్ తెలంగాణలో జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడంతో.. డాక్టర్ కావాలనుకున్న విద్యార్థులు.. తమ కలను సునాయసంగా నెరవేర్చుకుంటున్నారు.
- కరీంనగర్లో పేద విద్యార్థికి అడ్మిషన్
- జిల్లాకో మెడికల్ కాలేజీతో సాధ్యం
- కేసీఆర్‌కు నీట్ ర్యాంకర్ల కృతజ్ఞతలు
NEET | దామరచర్ల/తిమ్మాపూర్, ఆగస్టు 26: సీఎం కేసీఆర్ తెలంగాణలో జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేయడంతో.. డాక్టర్ కావాలనుకున్న విద్యార్థులు.. తమ కలను సునాయసంగా నెరవేర్చుకుంటున్నారు. ఇందులో భాగంగానే.. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెం, వాచ్యా తండాకు గిరిజన విద్యార్థులు, కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌కు చెందిన నిరుపేద విద్యార్థి నీట్లో ర్యాంకులు సాధించి మెడికల్ కళాశాలల్లో సీట్లు పొందారు. నల్లగొండ జిల్లా వీర్లపాలెం గ్రామానికి చెంది న నేనావత్ బుజ్జిబాబు-పార్వతి దంపతులకు ఇద్దరు కుమార్తెలు, కుమారుడు.
పెద్ద కూతురు హైమావతి నాలుగేండ్ల క్రితం నీట్లో ర్యాంకు సాధించి హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో మెడిసిన్‌లో చేరి హౌస్ సర్జన్ పూర్తి చేసింది. రెండో కూతురు నేనావత్ పద్మ రెండేండ్ల క్రితం నీట్లో ర్యాంకు సాధించి విజయవాడ సిద్ధార్థ కాలేజీలో చేరింది. ప్రస్తుతం మెడిసిన్ రెండో సంసత్సరం చదువుతున్నది. వీరితోపాటు కుమారుడు నేనావత్ రామకృష్ణ ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో 67 వేల ర్యాంకు సాధించి ఉస్మానియాలో సీటు సాధించాడు. ఇలా ఒకే ఇంట్లో ముగ్గురు విద్యార్థులు మెడికల్ విద్యను అభ్యసిస్తుండటం విశేషం. ఈ ముగ్గురూ ప్రాథమిక విద్యను స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదివారు. ఇదే మండలంలోని వాచ్యా తండాకు చెందిన లావూరి శ్రీనునాయక్ కూతురు ఖుషి నీట్లో 60 వేల ర్యాంకు సాధించి హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో సీటు పొందింది.
బజ్జీల బండి నడిపి..

Sai Kiran
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్‌కు చెందిన కొంగల సాయికిరణ్ టెన్త్, ఇంటర్ కరీంనగర్లో చదువుకున్నాడు. హాయిగా సాగుతున్న తన జీవితం లో తండ్రికి ఆరేండ్ల కింద పక్షవాతం రావడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. చదువు మానేసి.. తన ఇంటి ముందే నల్లగొండ రోడ్డుకు ఆనుకొని ‘ప్యూర్ వెజ్ స్నాక్స్’ పేరుతో బజ్జీల బండి ఏర్పాటు చేశాడు.
సాయికిరణ్ ఎంబీబీఎస్ చదవాలనుకున్న విషయాన్ని గిరిప్రసాద్ అనే వ్యక్తి తెలుసుకొని శ్రీ చైతన్య విద్యాసంస్థల యాజమాన్యానికి తెలిపారు. ఈ మేరకు సాయికిరణ్‌కు అక్కడ నీట్లో ఉచితంగా శిక్షణ ఇచ్చారు. పట్టుదలతో చదివి నీట్లో స్టేట్ ర్యాంకు 5,533 సాధించాడు. ఇటీవలే రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్య విజ్ఞాన కళాశాలలో అడ్మిషన్ పొందాడు. శ్రీ చైత న్య డైరెక్టర్ కర్ర నరేందర్‌రెడ్డి సాయికిరణ్‌ను అభినందించారు. ప్రతి జిల్లాలో వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి.. తమ లాంటి నిరుపేద విద్యార్థుల డాక్టర్ కావాలన్న కోరికను నెరవేర్చుతున్న సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామంటూ కృతజ్ఞతలు తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Horoscope | 26-11-2026 గురువారం.. మీ రాశి ఫలాలు
High Court | ఆర్డీవో జోక్యానికి వీల్లేదు.. గిరిజనేతరుల వివాదాలపై హైకోర్టు
BJP | ఈవీఎంలే ఉండాలని బీజేపీ పట్టు.. బ్యాలెట్ అంటే భయమెందుకు..?!
Truck park lands | ట్రక్‌పార్క్ భూముల వేలం రద్దు చేయాలంటూ పోరాటం.. నేతల అక్రమ అరెస్టులు
Miyapur Lands | వేలం పేరుతో ఖజానా నింపుకునేలా.. మియాపూర్ భూములపై రేవంత్ సర్కార్ కన్ను
ట్రెండింగ్ వార్తలు
Watch: బస్‌స్టాప్ వద్ద వేచి ఉన్న విద్యార్థులు.. వారిపైకి దూసుకెళ్లిన వాహనం
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

