గురువారం 22 అక్టోబర్ 2020
Telangana - Apr 01, 2020 , 15:11:34

కరోనా కట్టడి, లాక్‌డౌన్‌ అమలుపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

కరోనా కట్టడి, లాక్‌డౌన్‌ అమలుపై సీఎం కేసీఆర్‌ సమీక్ష

హైదరాబాద్‌ : ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మంత్రి ఈటల రాజేందర్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డితో సమీక్ష నిర్వహించారు. వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు హాజరయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌ అమలు, ఇతర అంశాలపై సీఎం చర్చిస్తున్నారు. 

కరోనా వైరస్‌ నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న విషయం విదితమే. వైద్యారోగ్య శాఖ మంత్రి, అధికారులతో సీఎం కేసీఆర్‌ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి, పరిస్థితులను తెలుసుకుంటున్నారు. కరోనాను నియంత్రించేందుకు ప్రజలందరూ సహకరించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. దీంతో రాష్ట్ర ప్రజలు స్వీయ నియంత్రణలో ఉంటున్నారు. 


logo