హైదరాబాద్: తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ (BRS) ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ (CM KCR) అధ్యక్షతన బీఆర్ఎస్ ప్రతినిధుల సభ మరికాసేపట్లో ప్రారంభం కానున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్ (Telangana Bhavan) చేరుకున్న సీఎం కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పార్టీ రిజిస్టర్లో సంతకం చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ముఖ్యమంత్రి వెంట ఎంపీ కే.కేశవరావు, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మంత్రులు సత్యవతి రాథోడ్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.