తెలంగాణ ముద్దు బిడ్డ అన్న కేసీఆర్
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): నాటితరం ప్రఖ్యా త నటుడు, రఘుపతి వెంకయ్య అవార్డు గ్రహీత, తెలంగాణ ముద్దుబిడ్డ కాంతారావు (తాడేపల్లి లక్ష్మీకాంతారావు) 99వ జయంతి (నవంబర్ 16) సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయనకు నివాళులర్పించారు. సినీ కళారంగానికి కాంతారావు చేసిన సేవలను స్మరించుకొన్నారు. సూర్యాపేట జిల్లా కోదాడ నియోజకవర్గం గుడిబండ మారుమూల గ్రామం నుంచి తెలుగు చిత్రసీమలోకి ప్రవేశించిన కాంతారావు 400కు పైగా పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో నటించి మెప్పించారని కొనియాడారు. తెలుగు సినీ కళామతల్లికి ఎన్టీఆర్, ఏఎన్నార్ రెండు కండ్లయితే, ‘నుదుట తిలకం’గా కాంతారావు ఖ్యాతి గడించడం తెలంగాణకు గర్వకారణమని సీఎం పేర్కొన్నారు.