కూల్చిన చోటే.. గెలిచి నిలిచినం
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి.
- అవమానపడ్డ దగ్గరే ఆత్మగౌరవ పతాకం
- చేనేత, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్
- జలదృశ్యం వద్ద లక్ష్మణ్ విగ్రహావిష్కరణ
- రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
రవీంద్రభారతి, సెప్టెంబరు 27(నమస్తే తెలంగాణ): ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరిగాయి. అధికారికంగా ప్రభుత్వ, ప్రభుత్వ రంగసంస్థల కార్యాలయాల్లో ఆయన చిత్రపటాలకు నివాళులర్పించారు. హైదరాబాద్ ట్యాంక్‌బండ్ జలదృశ్యం వద్ద ఏర్పాటు చేసిన 15 అడుగుల లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆవిష్కరించి నివాళులర్పించారు.
‘ఏ జలదృశ్యంలో అయితే ఉద్యమ నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ ఉద్భవించిందో, ఏ జలదృశ్యాన్నయితే అవమానకరంగా అప్పటి ప్రభుత్వం కూల్చివేసిందో.. ఈ రోజు అక్కడే కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహాన్ని సగౌరవంగా ఆవిష్కరించుకున్నాం. తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని సమున్నతంగా ఎగురవేశాం’ అని కేటీఆర్ పేర్కొన్నారు.
రవీంద్రభారతిలో నిర్వహించిన జయంత్యుత్సవాల్లో మంత్రులు తలసాని, గంగుల కమలాకర్ పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్సీ ఎల్ రమణ, బీసీ కమిషన్ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, సభ్యులు కిశోర్‌గౌడ్, ఉపేంద్ర, చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ వెంకటరత్నంలకు కొండా లక్ష్మణ్ బాపూజీ జీవన సాఫల్య పురస్కారాలను అందజేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MLA Padi Kaushik Reddy | హాస్యాస్పదంగా ఓటు చోరీపై రాహుల్ గాంధీ ధర్నా: ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి
రేవంత్ రెడ్డి.. అనుముల ఇంటెలిజెన్స్ కాదు, తెలంగాణ ఇంటెలిజెన్స్ ఉపయోగించాలి
IAS Shikhar Agrawal: 40 విల్లాలు కొన్న ఐఏఎస్ ఆఫీసర్.. హోల్డ్‌లో శిఖర్ అగర్వాల్ పోస్టింగ్
ప్రజా తిరుగుబాట్లు
Kota Maisamma | పెరిగిన కోట మైసమ్మ జాతర ఆదాయం.. ఎంతంటే?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

