ఎస్సీల మీద చేయి పడితే ప్రభుత్వం ఊరుకోదు : సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ | ఎస్సీల మీద చేయి పడితే తెలంగాణ ప్రభుత్వం ఊరుకోబోదని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో ఇటీవల జరిగిన మరియమ్మ లాకప్‌డెత్ ఘటనలో పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

హైదరాబాద్ : ఎస్సీల మీద చేయి పడితే తెలంగాణ ప్రభుత్వం ఊరుకోబోదని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు పోలీస్ స్టేషన్లో ఇటీవల జరిగిన మరియమ్మ లాకప్‌డెత్ ఘటనలో పోలీసుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై సమగ్ర విచారణకు ఆదేశించారు. లాకప్‌డెత్ కేసులో నిజనిర్ధారణ చేసి బాధ్యులపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. అవసరమైతే బాధ్యులైన వారిని ఉద్యోగం నుంచి తొలగించాలని అన్నారు. ఎస్సీ మహిళ లాకప్‌డెత్ చాలా బాధకరమని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని డీజీపీ మహేందర్ రెడ్డిని ఆదేశించారు. స్వయంగా ఖమ్మం జిల్లా చింతకాని వెళ్లి పూర్వాపరాలు విచారించాలని చెప్పారు. మరియమ్మ కుమారుడు ఉదయ్ కిరణ్‌కు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని అన్నారు. అదేవిధంగా నివాస గృహాంతోపాటు కుమారుడికి రూ. 15 లక్షలు, ఇద్దరు కుమార్తెలకు రూ. 10 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించారు. ఎస్సీల పట్ల సమాజ ధృక్పథం మారాలని సీఎం పేర్కొన్నారు. ఎస్సీలు, పేదల పట్ల పోలీసులు ఆలోచన ధోరణి మారాలని అన్నారు. ఎస్సీలకు అన్యాయం జరిగితే తక్షణమే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అంతకుముందు సీఎల్పీనేత బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్‌ను కలిసి మరియమ్మ లాకప్డెత్తోపాటు పలు అంశాలపై ఆయనకు వినతిపత్రం సమర్పించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

