CM KCR | ఖమ్మంలో ఐటీ టవర్‌ను కలలో ఊహించామా? : సీఎం కేసీఆర్
CM KCR | ఖమ్మం నగరంలో ఐటీ టవర్ వస్తుందని కలోనైనా ఊహించామా? అని సీఎం కేసీఆర్ అన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌ను మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పువ్వాడ అజయ్‌కుమార్‌కు మెడికల్ ఉన్నది.
CM KCR | ఖమ్మం నగరంలో ఐటీ టవర్ వస్తుందని కలోనైనా ఊహించామా? అని సీఎం కేసీఆర్ అన్నారు. ఖమ్మం నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్‌కుమార్‌ను మరోసారి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘పువ్వాడ అజయ్‌కుమార్‌కు మెడికల్ ఉన్నది. అయినా కూడా నాతో కొట్లాడి పట్టుపట్టి ఖమ్మానికి కూడా ప్రభుత్వ మెడికల్ కాలేజీ పెట్టించిన ఘనత ఆయనకే చెందుతుంది. రవాణాశాఖ మంత్రిగా ఉన్నందుకు అడ్వాంటేజ్ తీసుకున్నడు. హైటెక్ట్ బస్టాండు కట్టిండు. రూ.40కోట్లతో ఆర్టీసీ కల్యాణమండపం కట్టించిండు. ఇవన్నీ పనులు క్రమపద్ధతి ప్రకారం.. కమిట్మెంట్తో పని చేస్తే ఇలా తయారవుతుంది. బయటకు కూడా ఇలాగే ఖమ్మం పట్టణంలాగే కనీస వసతులు తీసుకువచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నయ్’ అన్నారు.
ఇన్వర్టర్ లేదు.. జనరేటర్ లేదు..
‘మంచినీళ్ల గురించి చెప్పాల్సిన అవసరం లేదు. పక్కనే పాలేరు రిజర్వాయర్ ఉన్నా వారినికి ఒకసారి నీళ్లు వచ్చేది. బిందెలతో యుద్ధాలు జరిగేవి. ఇవాళ 75వేల ట్యాప్ కన్షెన్లు ఖమ్మం ఉన్నయ్. ఒక్క రూపాయికే పేదలకు కనెక్షన్ ఇచ్చేలా పాలసీ తీసుకువచ్చాం. గతంలో కరెంటు ఎలా ఉండేది.. ఇప్పుడు ఎలా ఉందో ఆలోచన చేయాలి. గతంలో ప్రతి ఇంట్లో ఇన్వర్టర్, కన్వర్టర్, స్టెబిలైజర్, కలిగిన వారైతే జనరేటర్ ఉండేవి. ఇవాళ ఇన్వర్టర్ లేదు.. కన్వర్టర్ లేదు.. లో వోల్టేజీ లేదు.. కాలిపోయే పరిస్థితి లేదు. ఇక్కడ మంచి ఎమ్మెల్యే, ఎంపీలు ఉన్నారు. రూ.300కోట్లతో రఘునాథపాలెం మండలాన్ని అద్భుతంగా చేశారు. రఘునాథపాలెంలో వెతుకుదామంటే ఇవాళ మట్టిరోడ్డు లేదు. ఒకప్పుడు మట్టికొట్టుకుపోయిన రోడ్లే ఉండేవి. ప్రతి గ్రామానికి బీటీరోడ్డు వేయించి.. కొత్త 20 గ్రామ పంచాయతీలు చేయించి అద్భుతంగా రూరల్ మండలాన్ని తీర్చిదిద్దారు అజయ్‌కుమార్. ప్రభుత్వానికి ఉన్న విజన్.. అజయ్ మిషన్ తోడైతెనే అభివృద్ధి జరిగింది’ సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krishna | బాలయ్య ‘దాదా’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. వాయిదా రూమర్స్‌కు చెక్.. !
Ram Charan | మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ .. రామ్ చరణ్ – సుకుమార్ RC17 రిలీజ్ డేట్ ఫిక్స్?
Road Accident | దైవ దర్శనానికి వెళ్తూ యాక్సిడెంట్.. 13 మంది మృతి
Ramayana | సీత పాత్రపై విమర్శలు.. నెగిటివిటీపై లేడీ పవర్‌స్టార్ అదిరిపోయే సమాధానం!
IND vs NZ | బుమ్రా దెబ్బకు లాథమ్ ఔట్.. టీ బ్రేక్‌కు కివీస్ స్కోర్ ఇదే
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

