
సీఎం కేసీఆర్ పేదలకు మస్తు సాయం చేస్తుండు. ఉమ్మడి ఏపీలో నీళ్లు లేక ప్రాజెక్టులు ఎండిపోయేవి. చేప పిల్లలను పెంచేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నాం. ఇప్పుడు ఆ సమస్య లేదు. ప్రాజెక్టులకు జలకళ వచ్చింది. చేప పిల్లల పెంపకం గొప్పగా కొనసాగుతోంది. ముదిరాజ్లు ఆర్థికంగా ఎదుగుతున్నారు. అంతే కాకుండా రైతుబంధు, రైతుబీమా, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పథకాలను అమలు చేసి పేదలను ఆదుకుంటుండు. రుణమాఫీ చేసి రైతులకు అండగా నిలుస్తున్నారు. సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న కేసీఆర్కు మా ఓటు.
-దిగ్గునాల రవీందర్ ( జగ్గయ్యపల్లి గ్రామం, జమ్మికుంట మండలం )

రాష్ట్రం ఏర్పడిన తర్వాత రైతులను కేసీఆర్ ఆదుకుంటున్నారు. రైతుబంధు, రైతుబీమాతో పాటు 24 గంటల ఉచిత కరెంట్ అందివ్వడం గొప్ప విషయం. తెలంగాణను సస్యశ్యామలం చేస్తున్నారు. ప్రాజెక్టులు కట్టి, చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందిస్తున్నారు. రైతులందరూ సంతోషంగా ఉన్నారు. కోటి ఎకరాలకు సీఎం కేసీఆర్ సాగునీరు అందిస్తున్నారు. వెనుకబడిన కులాలకు సీఎం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. – రమణారెడ్డి ( చెల్లూరు గ్రామం, వీణవంక మండలం )