CM KCR | మనసున్న మారాజు సీఎం కేసీఆర్.. హరితకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం
CM KCR | రాష్ట్రంలోని ప్రతీ నిరుపేద బిడ్డ గొప్పగా చదువుకోవాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష. పేద పిల్లలందరూ గొప్ప చదువులు చదివి డాక్టర్లు, ఇంజినీర్లు కావాలన్నదే ఆయన కోరిక. అందుకే తెలంగాణలోని అన్ని వర్గాల పిల్లలకు నాణ్యమైన బోధనను అందించేందుకు సీఎం కేసీఆర్.. వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలు, కాలేజీలను ప్రారంభించారు.
CM KCR | రాష్ట్రంలోని ప్రతీ నిరుపేద బిడ్డ గొప్పగా చదువుకోవాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాంక్ష. పేద పిల్లలందరూ గొప్ప చదువులు చదివి డాక్టర్లు, ఇంజినీర్లు కావాలన్నదే ఆయన కోరిక. అందుకే తెలంగాణలోని అన్ని వర్గాల పిల్లలకు నాణ్యమైన బోధనను అందించేందుకు సీఎం కేసీఆర్.. వెయ్యికి పైగా గురుకుల పాఠశాలలు, కాలేజీలను ప్రారంభించారు. ఈ గురుకులాల్లో పది లక్షల మంది చదువుకుంటున్నారు. ప్రయివేటు విద్యార్థులకు ధీటుగా గురుకుల విద్యార్థులు ఇంటర్, టెన్త్ ఫలితాల్లో మెరిసిపోతున్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించే ప్రవేశ పరీక్షల్లో ర్యాంకుల పంట పండిస్తున్నారు.
అయితే బీసీ రెసిడెన్షియల్ కాలేజీలో చదివి ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీలో 470 మార్కులకు గానూ 468 మార్కులు సాధించిన హరిత అనే విద్యార్థినికి ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలిచారు. ఇచ్చిన మాట ప్రకారం ఆమెకు రూ. 5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. కేసీఆర్ పంపించిన రూ. 5 లక్షల చెక్కును శనివారం మంచిర్యాల కలెక్టరేట్ భవనంలో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్తో కలిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమన్ హరితకు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్కు హరిత తల్లిదండ్రులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఏడాది జూన్ 9వ తేదీన మంచిర్యాల జిల్లా పర్యటనకు వచ్చిన సందర్భంగా.. సీఎం కేసీఆర్ హరితను అభినందించిన విషయం తెలిసిందే. ఆమె ఉన్నత చదువులకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేస్తానని కేసీఆర్ మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం కేసీఆర్ చెక్కు పంపించారు. హరిత సొంతూరు చెన్నూరు నియోజకవర్గం పరిధిలోని మందమర్రి పట్టణం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
India Protests | భారత్లో విద్యార్థి నిరసనల అణచివేతపై ప్రశ్నించండి.. 13 కోట్ల మంది ఓటర్ల తొలగింపు ఆందోళనకరం
MK Stalin | ‘వెన్నుపోటు’ కాంగ్రెస్తో కలిసి పనిచేయం.. సీజేపీ నిరసనలకు స్టాలిన్ మద్దతు
Supreme Court | పనులు చేయకుంటే మేమే ధర్నాకు దిగుతాం.. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం
Greater Noida | గ్రేటర్ నోయిడాలో ఘోర విషాదం.. ఐదుగురి ప్రాణం తీసిన నూడుల్స్, టీ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

