CM KCR | నన్ను గెలిపించండి బీఆర్ఎస్లో జాయిన్ అవుతా.. అంటున్నరట కాంగ్రెస్ అభ్యర్థులు : సీఎం కేసీఆర్
CM KCR | కాంగ్రెసోళ్లు కొత్త పద్ధతి మొదలు పెట్టారని, నన్ను గెలిపించండి.. నేను బీఆర్ఎస్లో జాయిన్ అవుతా అని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు అంటున్నారట. అదంతా అవాస్తవం, ఝూటా ముచ్చట అని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. మంచిర్యాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, దివాకర్ రావుకు మద్దతుగా ప్రసంగించారు.
CM KCR | మంచిర్యాల : కాంగ్రెసోళ్లు కొత్త పద్ధతి మొదలు పెట్టారని, నన్ను గెలిపించండి.. నేను బీఆర్ఎస్లో జాయిన్ అవుతా అని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు అంటున్నారట. అదంతా అవాస్తవం, ఝూటా ముచ్చట అని ముఖ్యమంత్రి కేసీఆర్ మండిపడ్డారు. మంచిర్యాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ పాల్గొని, దివాకర్ రావుకు మద్దతుగా ప్రసంగించారు.
మీ దగ్గర కాంగ్రెసాయన గెలిస్తే మీకు వాడకట్టుకో పేకాట కబ్ల్. మంచిర్యాల నిండా పేకాట క్లబ్బులు.. ఇక క్లబ్బులకు కొదవ ఉండదు. ఇండ్లు అమ్ముకోవాలి పేకాటలో పెట్టాలి. చాలా ప్రమాదం సుమా.. దెబ్బతింటరు. జాగ్రత్తగా ఆలోచించి ఓటేయాలి. ఇక కాంగ్రెస్ నాయకులు కొత్త పద్దతి మొదలుపెట్టారు. నన్ను గెలిపించండి నేను బీఆర్ఎస్లో జాయిన్ అవుతా అని అంటున్నరట. ఇక్కడ ఉన్నాయన కూడా అట్లనే చెప్తున్నడట.. నాకు వార్త వచ్చింది. అదేం లేదు. అదంతా అబద్దం, ఝూటా ముచ్చట. ఏదన్న లంగతనం చేసి గెలవాలనే బద్మాష్‌గిరి తప్ప అది వాస్తవం కాదు. మేం పదేండ్లు కష్టపడి అన్ని రంగాల్లో నంబర్‌వన్‌లో ఉన్నాం. ఎల్లమ్మ కూడబెడితే మల్లమ్మ మాయం చేసిందనట్టు ఈ పదేండ్ల కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతది. దివాకర్ రావు గెలిస్తే మంచి లాభం జరుగుతది. దివాకర్ రావు నన్ను ఎప్పుడూ వ్యక్తిగత పనులు అడగలేదు. పొలాలకు నీళ్లు రావాలి. లిఫ్టులు కావాలని అడిగారు. గోదావరిపై కరకట్ట కట్టి మంచిర్యాలకు చుక్క వరద నీరు రాకుండా చేసే బాధ్యత నాది. ఆ పని కూడా చేస్తాం. అవసరమైతే ఈ ఎండాకాలంలో మొదలుపెట్టి శరవేగంగా పూర్తి చేయిస్తాం. దివాకర్ రావును గెలిపిస్తే మంచి జరుగుతది అని కేసీఆర్ తెలిపారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

