హైదరాబాద్ : గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన కొనసాగుతూనే ఉంది. భద్రాచలంలో వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన అనంతరం కేసీఆర్ ఏటూరు నాగారం బయల్దేరారు. భద్రాచలం నుంచి ఏటూరు నాగారం వరకు కేసీఆర్ ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకృతి విపత్తుతో జలమయమై, ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిని పరిశీలించారు. నదికి ఇరువైపులా వరదల్లో చిక్కుకున్న గ్రామాల్లో వరద పరిస్థితిని పరిశీలిస్తూ సీఎం హెలికాప్టర్లో ఏటూరు నాగారం చేరుకున్నారు.
అక్కడి ఐటీడీఏ గెస్ట్ హౌజ్ లో లంచ్ చేస్తున్నారు. అనంతరం, కరకట్ట వద్ద ఏర్పాటు చేసిన ముంపు బాధితుల పునరావాస కేంద్రానికి వెళ్లి, ముంపు బాధితులను సీఎం పరామర్శిస్తారు. అక్కడే అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్లో మారుమూల ప్రాంతాల్లో వరదల పరిస్థితిని ముఖ్యమంత్రి పరిశీలిస్తారు.
భద్రాచలం నుండి ఏటూరు నాగారం దిశగా ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ హెలీకాప్టర్లో వరద ప్రభావిత ప్రాంతాల ఏరియల్ సర్వే నిర్వహించారు. ప్రకృతి విపత్తుతో ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరిని, నదికి ఇరువైపులా జలమయమై, నీటిలో చిక్కుకున్న గ్రామాల్లో పరిస్థితిని పరిశీలించారు. #TelanganaFloods pic.twitter.com/szOtdA4lXz
— Telangana CMO (@TelanganaCMO) July 17, 2022