శ్రీరాంపూర్, మార్చి 27 : సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల కాలపరిమితి ముగిసిందని, వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఆ సంఘాల ప్రతినిధుల ఫిర్యాదుమేరకు గురువారం కేంద్ర కార్మిక, ఉపాధి మత్రిత్వ శాఖ, కేంద్ర చీఫ్ లేబర్ కమిషనర్ ఒసాన్ప్రస్తీ, డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ బిస్వాలు స్పందించారు. ఎన్నికల ప్రక్రియ మొదలు పెట్టాలని సింగరేణి సీఎండీ, డైరెక్టర్ (పర్సనల్, అడ్మినిస్ట్రేషన్ అండ్ వెల్ఫేర్)కు సీఎల్సీ నోటీసు నోటీసు పంపించారు. సింగరేణిలోని రిజిస్టర్ కార్మిక సంఘాలు, జాతీయ కార్మిక సంఘాల ప్రతినిధులు 27 డిసెంబర్ 2023న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలను రెండేండ్ల కాల పరిమితి ఒప్పందంతో నిర్వహించారు.
తిరిగి గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలని సీఎల్సీ, ఆర్ఎల్సీలకు ఫిర్యాదు చేసినట్టు యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లారు. ఎన్నికలు పూర్తయ్యేవరకూ ఉద్యోగులకు సంబంధించిన ఎలాంటి అంశాలైనా సింగరేణి కార్మిక సంఘాల ప్రతినిధుల సమ్మతితో చర్చించి, ఖరారు చేయాలని అభ్యర్థించినట్టు నోటీసులో పేర్కొన్నారు. సింగరేణి యాజమాన్యం ఫిర్యాదుపై స్పందించి 10 రోజుల్లోగా సీఎల్సీ, ఆర్ఎల్సీకి సమాచారం అందించాలని కోరింది.