హైదరాబాద్, సెప్టెంబర్5 (నమస్తే తె లంగాణ): అర్ధాంతరంగా తొలగించిన త మను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి, లే దంటే ఆమరణ దీక్షలకు దిగుతామని గురుకులాల నుంచి ఇటీవల తొలగింపునకు గురై న సిబ్బంది స్పష్టంచేశారు. ఈ మేరకు తమ ను విధుల్లోకి తీసుకోవాలని సాంఘిక సం క్షేమ గురుకుల సొసైటీల్లోని సీవోఈ (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్), నాన్ సీవోఈలు, ప్ర త్యేక గురుకులాలు, వొకేషనల్ గురుకులాల పార్ట్‌టైం, గెస్ట్ ఫ్యాకల్టీ, సబ్జెక్ట్ అసోసియేట్లు, ఫిజికల్ డైరెక్టర్లు రెండోరోజైన గురువారం సొసైటీ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
సెక్రటరీ నిర్ణయంతో 6,500 మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయని, 3 నెలలుగా వేతనాలు కూడా చెల్లించలేదని, ఇదేమని అడిగినందుకు కక్షగట్టి విధుల నుంచి తొలగించారని తెలిపారు. ఉదయం నుంచి నిరీక్షించినా ఏమాత్రం లెక్కచేయకుండా సెక్రటరీ, ఇతర అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.