OTT Movies | గత వారం థియేటర్లలో సమంత నటించిన ‘మా ఇంటి బంగారం’ ప్రేక్షకులను అలరించగా, ఈ వారం బాక్సాఫీస్ వద్ద పెద్ద సినిమాల సందడి తక్కువగా కనిపిస్తోంది. అయితే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో మాత్రం యాక్షన్, సైకలాజికల్, క్రైమ్, హారర్ థ్రిల్లర్లతో పాటు ఆసక్తికరమైన డాక్యుమెంటరీలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. ముఖ్యంగా ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’, ‘బ్లాస్ట్ జోన్’ వంటి ప్రాజెక్టులపై మంచి అంచనాలు నెలకొన్నాయి.
యాక్షన్ కింగ్ అర్జున్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన తాజా యాక్షన్ థ్రిల్లర్ ‘బ్లాస్ట్ జోన్’ ఈ వారంలో ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. అభిరామి, ప్రీతి ముకుందన్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం థియేటర్లలో మంచి స్పందన అందుకుంది. ఇప్పుడు జూన్ 25 నుంచి ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
భారతీయ సినీ చరిత్రలో సంచలనం సృష్టించిన ‘బాహుబలి’ ఫ్రాంచైజీ నిర్మాణ ప్రయాణాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయడానికి ‘బాహుబలి: ది టార్చ్ బేరర్’ పేరుతో ప్రత్యేక డాక్యుమెంటరీ సిరీస్ రూపొందించారు. ఈ సిరీస్‌లో సినిమాకు సంబంధించిన తెరవెనుక కథలు, యుద్ధ సన్నివేశాల రూపకల్పన, చిత్రీకరణలో ఎదురైన సవాళ్లు, దర్శకుడు రాజమౌళి విజన్ వంటి ఆసక్తికర అంశాలను చూపించనున్నారు. జూన్ 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
కదిర్, దివ్యభారతి ప్రధాన పాత్రల్లో రూపొందిన తమిళ స్పోర్ట్స్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ ‘లింగం’ కూడా ఈ వారంలో ఓటీటీలోకి రానుంది. ప్రశాంత్ పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ జూన్ 26 నుంచి ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది.
హౌస్ ఆఫ్ డ్రాగన్ సీజన్ 3 (తెలుగు డబ్బింగ్) – జూన్ 22
గ్రామ చికిత్సాలయ్ సీజన్ 2 – జూన్ 23
అలియన్స్ (హిందీ సిరీస్) – జూన్ 26
మరీచిక
దృశ్యం 3
యువర్ ఫాల్ట్ (తెలుగు డబ్బింగ్ రొమాంటిక్ డ్రామా)
ఇన్ ది హ్యాండ్ ఆఫ్ డాంటే – జూన్ 24
అనదర్ లైఫ్ సీజన్ 3 – జూన్ 24
బ్లాస్ట్ జోన్ – జూన్ 25
క్రిస్మ్ అండ్ మార్టినా – జూన్ 26
లిటిల్ బ్రదర్ – జూన్ 26
బాహుబలి: ది టార్చ్ బేరర్ – జూన్ 26
లాక్ అప్ సీజన్ 2 – జూన్ 27
ది ఏజెన్సీ సీజన్ 2 – జూన్ 22
అవతార్ 3 (తెలుగు డబ్బింగ్) – జూన్ 24
లింగం – జూన్ 26
కెనతా కానోమ్
సేవ్ ది టైగర్స్
అతిరథి
ప్రేమలా కండిషన్స్ అప్లై – జూన్ 26
మమ్మటియన్ స్టార్స్ – జూన్ 26
ముతస్సీ – జూన్ 26
బ్లూ బాస్మిన్ – జూన్ 26
ది యెతి
దిస్ ఈజ్ నాట్ ఎ మర్డర్ మిస్టరీ
రేజర్
థాంక్యూ సుబ్బారావు
ధైర్యే సాహసే అమృత
పర్ఫెక్ట్ ఫ్యామిలీ – జూన్ 26
కప్ – జూన్ 25
ఈ వారం థియేటర్ల కంటే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లోనే ప్రేక్షకులకు ఎక్కువ వినోదం దక్కనుంది. యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్, డాక్యుమెంటరీ, ఫ్యామిలీ డ్రామా ఇలా అన్ని జానర్లలోనూ కొత్త కంటెంట్ అందుబాటులోకి రానుండటంతో సినీ అభిమానులకు ఇది ఫుల్ ఎంటర్టైన్మెంట్ వీక్‌గా మారనుంది.