హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్కన్నా ఆదివారం ఉదయం తిరుమల వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. మొదటిసారిగా తిరుమలకు వచ్చిన జస్టిస్ సంజీవ్ ఖన్నాకు ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఈవో జే శ్యామలరావు, అదనపు ఈవో సీహెచ్ వెంకయ్యచౌదరి సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం అర్చకులు శేషవస్త్రం కప్పి, రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.