హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఆటో ఎల్పీజీ కొరత లేకుండా చర్యలు చేపడుతునట్టు సివిల్ సైప్లె కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆటో ఎల్పీజీ సరఫరా చేసే ప్రైవేట్ మార్కెటింగ్ కంపెనీలతో ఏర్పా టు చేసిన రివ్యూలో ఆయన మాట్లాడుతూ.. వారం రోజుల్లో 363 మెట్రిక్ టన్నుల ఆటో ఎల్పీజీని సరఫరా చేసినట్టు వివరించారు. మూతబడిన 17 బంకులను తెరిపించామని పేర్కొన్నా రు. గ్యాస్ సరఫరా పెంచి, మూతపడిన బంకులను మళ్లీ తెరిపించడంలో చొర వ చూపిన సూపర్ గ్యాస్, గో గ్యాస్, టోటల్ ఎనర్జీస్, ప్రైమ్ ఫ్యూయల్ కంపెనీలను కమిషనర్ అభినందించారు. ఆటో ఎల్పీజీ సరఫరాలో ఇబ్బందులు ఉంటే హెల్ప్ లైన్ నంబర్ 1967ను సంప్రదించాలని కోరారు.
హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : ఇరాన్‌పై ఇజ్రాయెల్‌తో కలిసి అమెరికా చేస్తున్న యుద్ధం ప్రపం చ దేశాల్లో అనేక సమస్యలకు కారణం అవుతున్న పరిస్థితుల్లో ప్రధాని మోదీ వెంటనే స్పందించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కే రామకృష్ణ డిమాండ్ చేశా రు. మంగళవారం సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో రామకృష్ణ మాట్లాడుతూ .. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధోన్మాదంతో వ్యవహరిస్తూ పిచ్చిప్రేలాపనలు చేస్తున్నారని విమర్శించా రు. యుద్ధం ప్రారంభమై ఐదు వారా లు అవుతుందని జనావాసాలపై దాడు లు చేస్తున్న ట్రంప్ ప్రపంచానికి ఏమీ చెప్పాలనుకుంటున్నాడని ప్రశ్నించారు.
ప్రపంచంలో ఇంత జరుగుతున్నా, ప్రజలు ఇబ్బందులు పడుతున్నా యు ద్ధాన్ని ఖండించలేని వ్యక్తి ప్రధానిగా ఉండటం సిగ్గుచేటని మండిపడ్డారు. సీఎం చంద్రబాబు గోదావరి నీళ్లు 3 వేల టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయని, వాటిని మళ్లించాల్సి అవసరంపై మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని రామకృష్ణ విమర్శించారు. 1995లో శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులను నిర్దిష్ట గడువులో పూర్తి చేస్తామని స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ రాజధాని సమస్యలో బీజేపీ కూడా ముద్దాయేనని విమర్శించారు.