హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): రాజేంద్రనగర్లోని గిరిజన ఐఏఎస్ స్టడీ సర్కిల్లో సివిల్ సర్వీసెస్ శిక్షణకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ శనివారం ప్రకటనలో వెల్లడించింది. 2026 సివిల్ సర్వీసెస్ పరీక్షకు ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్ధులకు ఉచిత వసతితోపాటు ఇంటిగ్రేటెడ్ గైడెన్స్ శిక్షణ అందించనున్నట్టు తెలిపింది.
మెరిట్ సాధించిన అభ్యర్థులను శిక్షణకు ఎంపిక చేస్తామని వివరించింది. కుటుంబ వార్షిక ఆదాయం రూ.3లక్షలు దాటని అభ్యర్థులు http://studycircle.cgg.gov.in, లేదా http://twd.telangana.gov.in వెబ్సైట్ ద్వారా పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, వివరాలకు 6281766534 నంబర్లో సంప్రదించాలని సూచించింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.