బుధవారం 30 సెప్టెంబర్ 2020
Telangana - Aug 26, 2020 , 02:34:08

ఉద్యోగుల మృతి బాధాకరం

ఉద్యోగుల మృతి బాధాకరం

  • ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి 
  • ఈగలపెంటలో అమరుల సంతాప సభ
  • శ్రీశైలం ప్రమాదంపై ముమ్మర దర్యాప్తు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/శ్రీశైలం/అచ్చంపేట: విధి నిర్వహణలో ప్రాణ త్యాగం చేసిన విద్యుత్‌ ఉద్యోగుల మరణం తీవ్రంగా కలిచివేసిందని ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డి అన్నారు. మంగళవారం సాయంత్రం నాగర్‌కర్నూల్‌ జిల్లా ఈగలపెంట జెన్‌కో కాలనీలో విద్యుత్‌ అమరులను స్మరిస్తూ ఎస్‌ఎల్‌బీహెచ్‌ఈఎస్‌ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సంతాప సభలో ఆయన మాట్లాడారు.అనంతరం జరిగిన సమావేశంలో ఆయా విద్యుత్‌ ఉద్యోగుల ట్రేడ్‌ యూనియన్‌ రాష్ట్ర నేతలు మాట్లాడుతూ ఆగస్టు 20 విద్యుత్‌ ఉద్యోగులు, కా ర్మికులకు చీకటిరోజు అని, ఆ రోజును తెలంగాణ విద్యుత్‌ అమరవీరుల స్మారకదినంగా ప్రకటించాలని, మరణించిన ఉద్యోగుల జ్ఞాప కార్థం విద్యుత్‌ స్మృతివనం నిర్మించాలన్నారు. సీఎండీ ప్రభాకర్‌రావు నియమించిన  కమిటీలో నిజాయితీ, నిబద్ధతతో పని చేస్తున్న వారే ఉన్నారని.. నిష్పాక్షికంగా విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.

రెండోరోజు కొనసాగిన సంస్థాగత విచారణ 

శ్రీశైలం ఎడమగట్టు జలవిద్యుత్‌ కేంద్రం లో అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలుసుకునేందుకు సీఐడీ అధికారులు శ్రమిస్తున్నా రు.ప్రమాదం జరిగిన యూనిట్లలో సేకరించిన కాలిపోయిన విద్యుత్‌ తీగలు, ఇతర సామగ్రిని ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌కు తరలించారు. ప్రాథమిక వివరాల ఆధారంగా శాస్త్రీ య కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు.  ప్రమాదం పూర్వాపరాలను అధ్యయనం చే సేందుకు వచ్చిన సంస్థాగత కమిటీ విచారణ రెండోరోజు కూ డా కొనసాగింది. మంగళవారం ఉదయం పవర్‌ప్లాంట్‌ టన్నల్‌ ఎంట్రె న్స్‌ వద్ద 300 మందికి పైగా సిబ్బందితో ఆ తరువాత శక్తిభవన్‌లో ఇంజినీరింగ్‌, ఓ అండ్‌ ఎం అధి కారులతో విచారణ కమిటీ  పత్యేక సమావేశాన్ని నిర్వహించింది. ప్రమాద ప్రాం తంలో కార్బన్‌ మోనాక్సైడ్‌ వంటి ఘాటైన వాయువులు ఇప్పటికీ ఉన్నాయని.. దీంతో శ్వాస తీసుకోవడం ఇ బ్బందిగా ఉన్నదని సిబ్బంది చెప్పారు. తమకు ఆక్సిజన్‌ సిలిండర్‌ కిట్లు, సేఫ్టీ పరికరాలు ఇవ్వాలన్నారు. 

రూ.3 కోట్ల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి

 శ్రీశైలం ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.3 కోట్ల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని కోరుతూ టీఎస్‌పీఈజేఏసీ నేతలు మంగళవారం  విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.  


logo