హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 20 : కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి ఆత్మహత్య చేసుకున్నారు. హైదరాబాద్ అల్వాల్‌లోని పంచశీల కాలనీలో గల తన నివాసంలో గురువారం ఉరి వేసుకొన్నారు. వెంటనే గుర్తించిన కుటుంబ సభ్యులు దవాఖానకు తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. వీరిది ప్రేమ వివాహం. వీరికి బాబు, పాప ఉన్నారు. అయితే భార్యభర్తల మధ్య కొంతకాలంగా విభేదాలు ఉన్నట్టు తెలుస్తున్నది.