హైదరాబాద్ : ఉషాకిరణ్ ఫిలిమ్స్ అధినేత రామోజీరావు (Ramoji Rao) మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) రామోజీ అస్తమయంపై ఎక్స్‌లో దిగ్భ్రాంతిని ప్రకటించారు. రామోజీ ఎవరికీ తలవంచని మేరు పర్వతం దివికేగిందని, ఓం శాంతి అంటూ సంతాపం తెలిపారు.
రామోజీ మరణం బాధాకరం.. ఎన్టీఆర్
రామోజీరావు మన మధ్యన లేరు అనే వార్త చాలా బాధాకరమనం జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) పేర్కొన్నారు. మీడియా సామ్రాజ్యాధినేత, భారతీయ సినిమా దిగ్గజం రామోజీ లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిదని అన్నారు. ‘నిన్ను చూడాలని’ చిత్రంతో నన్ను తెలుగు సినీపరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికీ మరువలేనని అన్నారు.