బేగంపేట జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర అర్చక ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడిగా చింతపట్ల బద్రీనాథ్ ఆచార్యులు ఎన్నికయ్యారు. గురువారం బేగంపేటలోని హనుమాన్ ఆలయంలో నిర్వహించిన జేఏసీ రాష్ట్ర సర్వసభ్య సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
అర్చక ఉద్యోగుల సంక్షేమం కోసం గతంలో బద్రీనాథ్ 577 జీవో కోసం కృషి చేశారని ఉద్యోగులు కొనియాడారు. బద్రీనాథ్ మాట్లాడుతూ ఉద్యోగుల హెల్త్‌కార్డ్, గ్రాట్యుటీ పెంపుదల, పెన్షన్, కరోనా బాధితుల కోసం ఎంతో కృషి చేశామన్నారు. కాగా, జేఎసీ చైర్మన్‌గా గంగు ఉపేంద్ర శర్మ, కన్వీనర్లుగా కృష్ణమాచార్యులు, రవీంద్రచారి ఎన్నికయ్యారు.