హైదరాబాద్, మే 17 (నమస్తే తె లంగాణ): కాలువ గట్ల వెంట 389 బ్లాకుల్లో ఈ ఏడాది మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు జా రీ చేశారు. నీ టిపారుదల, పంచాయతీరాజ్, అటవీశాఖ అధికారులు, కలెక్టర్లతో సీఎస్ బుధవారం ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. సాగునీటి భూముల్లో మొక లు పెంపకంపై రూపొందించిన మైక్రోప్లాన్పై చర్చించారు.
అనంతరం ఆమె మాట్లాడుతూ కాలువ గట్ల వెం ట 389 బ్లాకుల్లో కలప, ఫలాలు ఇచ్చే మొకలు పెంచాలని, అందుకు సం బంధించిన మొక్కలు అటవీ, పంచాయతీ నర్సరీల్లో అందుబాటులో ఉ న్నాయని చెప్పారు. మూడెకరాల కం టే ఎకువ విస్తీర్ణంలో చేపట్టే ప్లాంటేషన్ నమూనాను సిద్ధం చేయాలని, ట్రెంచింగ్ డిజైన్‌ను రూపొందించాలని ప్రత్యేకంగా ఆదేశించారు. జూన్ 15 నుంచి పనులు ప్రారంభించాలని ఆమె ఆదేశించారు.
సమావేశంలో పీసీసీఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ హనుమంతరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.