కాంగ్రెస్‌కు ఓట్లేసి నోట్లో మన్ను పోసుకున్నం!
‘కాంగ్రెస్‌కు ఓట్లేసి మా నోట్లో మేమే మన్ను పోసుకున్నం’ అని నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లికి చెందిన మహిళలు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఎదుట వాపోయారు. కొత్తపల్లి మండల కేంద్రంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోయి ఆత్మహత్యకు యత్నించిన యాదగిరిగౌడ్ కుటుంబాన్ని బుధవారం పట్నం పరామర్శించారు. అలాగే విస్తరణలో కూల్చేసిన ఇండ్లను పరిశీలించారు.
- ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మా భూములను కాజేస్తున్నడు
- ఇండ్లను కూల్చి రోడ్డున పడేస్తున్నడు
- బాధపెట్టినోడు నాశనమైపోతడు
- రేవంత్‌రెడ్డి సర్కార్‌పై బాధిత మహిళల శాపనార్థాలు
మద్దూర్(కొత్తపల్లి), ఆగస్టు 26 : ‘కాంగ్రెస్‌కు ఓట్లేసి మా నోట్లో మేమే మన్ను పోసుకున్నం’ అని నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లికి చెందిన మహిళలు కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఎదుట వాపోయారు. కొత్తపల్లి మండల కేంద్రంలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోయి ఆత్మహత్యకు యత్నించిన యాదగిరిగౌడ్ కుటుంబాన్ని బుధవారం పట్నం పరామర్శించారు. అలాగే విస్తరణలో కూల్చేసిన ఇండ్లను పరిశీలించారు.
అలాగే కొత్తపల్లి మండలం తిమ్మారెడ్డిపల్లిలో పింఛన్లు కోల్పోయిన బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా మహిళలు అంజిలమ్మ, భారతమ్మ, బుడ్డమ్మ.. పట్నం నరేందర్‌రెడ్డి ఎదుట తమ గోడువెళ్లబోసుకున్నారు. ‘రేవంత్‌రెడ్డి మాటలు నమ్మి.. మా నోట్లో మేమే మన్ను పోసుకున్నం సారూ’.. అంటూ కన్నీళ్లు పెట్టుకొన్నారు. ‘నమ్మి ఓట్లేస్తే మా భూములను కాజేసి, మా ఇండ్లను కూలుస్తున్నాడు’ అంటూ ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ పాలనే బాగుండే సారూ.. అంటూ గుర్తుచేసుకున్నారు. తమను బాధ పెట్టిన సర్కారోడు నాశనమైపోతాడంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తంచేశారు. కొత్తపల్లిలో రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోయి ఆత్మహత్యకు యత్నించిన యాదగిరిగౌడ్ మాట్లాడుతూ.. ‘నాలుగు నెలల కిందట నా ఇల్లు కూల్చారు.
మిగిలిన ఇంటిని బాగు చేసుకొని హోటల్ పెట్టుకొని జీవనం సాగిస్తుంటే.. నాపై కక్షతో మరోసారి మిగిలిన భాగాన్ని కూడా కూల్చేందుకు బుల్డోజర్లు పంపించారు’ అంటూ పట్నం వద్ద కన్నీళ్లు పెట్టుకున్నాడు. అనంతరం పట్నం అక్కడే మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి రాలేమని తెలిసే సీఎం సోదరులు భూ కబ్జాలతో బరితెగించారని విమర్శించారు. కాంగ్రెస్‌ను నమ్మి గెలిపించిన ప్రజల ఇండ్లనే కూలుస్తున్నారని మండిపడ్డారు. రోడ్డు విస్తరణ పనులు నిబంధనల మేరకు చేపట్టడం లేదని, ఇలాగే కొనసాగిస్తే బాధితుల తరపున కొత్తపల్లి చౌరస్తాలో భారీ ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. అవసరమైతే బాధితులతో కలిసి న్యాయపోరాటానికి సిద్ధమని స్పష్టంచేశారు. కేసీఆర్ మళ్లా సీఎం కాగానే బాధితులకు 200 గజాల ప్లాటుతోపాటు పింఛన్లు కోల్పోయిన వారికి తిరిగి పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ఈఎంసిలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Bathukamma | జపాన్‌లో బతుకమ్మ సంబురాలు.. టోక్యోలో వెల్లివిరిసిన తెలంగాణ సంస్కృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

