Chevella Accident | బస్సు ప్రమాద ఘటనపై కేసు నమోదుచేసిన చేవెళ్ల పోలీసులు
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో (Chevella Accident) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు డ్రైవర్లు సహా 21 మంది మృతిచెందారు. మరో 20 మంది గాయపడ్డారు.
చేవెళ్ల: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో (Chevella Accident) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు డ్రైవర్లు సహా 21 మంది మృతిచెందారు. మరో 20 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై చేవెళ్ల పోలీసులు కేసు నమోదుచేశారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు.
కాగా, చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై విచారణ జరుగుతున్నదని సైబరాబాద్ సీపీ మహంతి అన్నారు. బస్సు, టిప్పర్ డ్రైవర్ల మృతితో తప్పు ఎవరిదనేది ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. బస్సును ఢీకొనడంతో టిప్పర్లోని కంకర బస్సులో పడిందని, దీంతో ఒక్కసారిగా మృతుల సంఖ్య పెరిగిందని వెల్లడించారు. మృతుల బంధువుల విజ్ఞప్తి మేరకు చేవెళ్లలోనే శవపరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. శవపరీక్ష పూర్తయిన తర్వాత మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నామని వెల్లడించారు.
మరోవైపు చేవెళ్ల రోడ్డు ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్‌ను ఆకాశ్ కాంబ్లేగా గుర్తించారు. మహారాష్ట్రకు చెందిన కాంబ్లు.. మహబూబ్‌నగర్‌కు చెందిన లచ్చానాయక్ వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. పటాన్‌చెరులోని క్రషర్ మిల్లు నుంచి వికారాబాద్‌కు టిప్పర్ వెళ్తున్నదని అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో చేవెళ్ల మండలం మీర్జాగూడ వద్ద రోడ్డుపై గుంతను తప్పించబోయి బస్సును ఢీకొట్టిందన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్‌లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

