Fake Fingerprints | సైబర్ నేరగాళ్ల కొత్త పంథా.. వేలిముద్రలు కొట్టేసి మరీ బ్యాంకులో డబ్బులు చోరీ
Fake Fingerprints | సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. మన బ్యాంకు ఖాతాల వివరాలు, ఓటీపీలు ఎవరికీ చెప్పకున్నా ఆధార్ కార్డు ఆధారంగా బ్యాంకు ఖాతాలను లూటీ చేసేస్తున్నారు.
Fake Fingerprints | హైదరాబాద్ సిటీబ్యూరో, మే 15 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు రోజురోజుకూ రెచ్చిపోతున్నారు. మన బ్యాంకు ఖాతాల వివరాలు, ఓటీపీలు ఎవరికీ చెప్పకున్నా ఆధార్ కార్డు ఆధారంగా బ్యాంకు ఖాతాలను లూటీ చేసేస్తున్నారు. కార్డుదారుడితో సంబంధం లేకుండా సిలికాన్ థంబ్స్‌ను ఉపయోగించి ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్‌ల ద్వారా మన సొమ్మును దోచేస్తున్నారు. ఇందుకోసం ఆధార్ కార్డుల జారీ సంస్థ యూఐడీఏఐ (యూనిక్ ఐడెంటిఫికేషన్ డెవలప్మెంట్ అథారిటీ అఫ్ ఇండియా) పంపినట్టుగా సామాన్య ప్రజల సెల్ఫోన్లకు మెసేజ్‌లు పంపుతున్నారు.
తన ప్రమేయం లేకుండా తన ఆధార్ ఫింగర్ ప్రింట్‌ను వాడినట్టు వెంటవెంటనే ఏడు సార్లు ఈ-మెయిళ్లు వచ్చాయని ఓ బాధితుడు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు 15 రోజుల క్రితం సంబంధిత బ్యాంకుతోపాటు యూఐడీఏఐకి లేఖలు రాశారు. దీంతో ఫిర్యాదుదారుడి ఫింగర్ ప్రింట్‌ను తాము ఎక్కడా ఉపయోగించలేదని, బాధితుడికి వచ్చిన ఈ-మెయిళ్లతో తమకు సంబంధం లేదని ఆ బ్యాంకు పేర్కొనగా.. యూఐడీఏఐ నుంచి మాత్రం ఇప్పటికీ ఎలాంటి జవాబు రాలేదు. తాజాగా ఓ యూట్యూబర్ తన తల్లి బ్యాంకు ఖాతా నుంచి డబ్బు మాయమైందని ట్వీట్ చేశాడు.
మూడేండ్ల క్రితమే..
హైదరాబాద్‌లో మూ డేండ్ల క్రితమే ఇలాంటి స్కామ్‌లు వెలుగులోకి వచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో చాలా బ్యాంకులు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసెస్ (ఏఈపీఎస్) సిస్టమ్ ద్వారానే డబ్బు చెల్లింపులు జరుపుతుండటంతో సైబర్ నేరగాళ్లు సింథటిక్ ఫింగర్ ప్రింట్స్‌ను ఉపయోగించి ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్ స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ వెబ్సైట్ నుంచి 2022 జూన్‌లో సేకరించిన 149 మంది కస్టమర్ల డాటా ఆధారంగా నకిలీ వేలిముద్రలు తయారు చేసిన ఓ ముఠా.. ఏఈపీఎస్ ద్వారా రూ.14 లక్షలు కొల్లగొట్టింది. ఆ తర్వాత ఈ ముఠా నుంచి పోలీసులు 2,500 క్లోనింగ్ వేలిముద్రలను స్వాధీనం చేసుకున్నారు.
బయోమెట్రిక్‌ను లాక్చేస్తే సరి
రాజస్థాన్, జార్ఖండ్, గుర్గావ్ తదితర ప్రాంతాల్లో సైబర్ నేరగాళ్లు నకిలీ పింగర్ ఫ్రింట్స్ను తయారుచేసి ఇలాంటి నేరాలకు పాల్పడుతున్నట్టు హైదరాబాద్ సైబర్‌క్రైమ్ పోలీసులు గుర్తించారు. దీంతో మన వేలిముద్రలను ఇతరులెవరూ ఉపయోగించకుండా చూసేందుకు యూఐడీఏఐ వెబ్సైట్లో బయోమెట్రిక్ అథెంటికేషన్‌ను లాక్ చేసుకునే అప్షన్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీన్ని ఉపయోగించుకుంటే మన ఫింగర్ ప్రింట్స్‌ను ఎవరూ ఉపయోగించేందుకు వీలుండదని హైదరాబాద్ సైబర్‌క్రైమ్స్ ఏసీపీ కేవీఎం ప్రసాద్ తెలిపారు. మనకు అవసరమైనప్పుడు యూఐడీఏఐ వెబ్సైట్లో బయోమెట్రిక్ అథెంటికేషన్‌ను అన్‌లాక్ చేసుకుని ఫింగర్ ప్రింట్‌ను ఉపయోగించుకోవాలని, ఆ తర్వాత తిరిగి దాన్ని లాక్ చేసుకోవాలని సూచించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Sheikh Hasina | నన్ను చంపొచ్చు.. హింసించొచ్చు.. తిరిగి వెళ్లడం నా బాధ్యత : షేక్ హసీనా
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

