హైదరాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ): తిరుమలలో శ్రీవారి దర్శనం టికెట్ల విషయంలో దళారీ వ్యవస్థకు చెక్ పెట్టామని టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఏడాదికాలంలో 30వేల నకిలీ వెబ్సైట్లను క్రాష్ చేశామని పేర్కొన్నారు. శ్రీవారి దర్శనం కోసం ఏఐని పరిచయం చేయబోతున్నామని, గూగుల్, టీసీఎస్ వంటి సంస్థలతో సంప్రదింపులు జరుగుతున్నాయి అని చెప్పారు. ఈ మేరకు బుధవారం తిరుమలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీటీడీ ఉద్యోగులలో ఇప్పటికీ అన్యమతస్థుల వారు ఉన్నారని, వారిని దశలవారీగా తొలగింగే విధంగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చే సాధారణ భక్తులకు అధిక ప్రాధాన్యత కల్పించే దిశగా వీఐపీ దర్శనాలు కుదించడం జరుగుతున్నదని తెలిపారు.