మూసాపేట, నవంబర్ 26: ఓ మహిళను పెండ్లి చేసుకుంటానని చెప్పి ఆమెతో సహజీవనం చేస్తూ రూ.20 లక్షల మేర మోసం చేసిన ఆరోపణపై సినీ నటుడు శ్రీతేజ్మీద కూకట్పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. తొలుత గచ్చిబౌలి పీఎస్‌లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు కూకట్పల్లి పీఎస్‌కు బదిలీ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మూసాపేట ఆంజనేయనగర్‌కు చెందిన శ్రీతేజ్‌కు, మొయినాబాద్ అజీజ్‌నగర్‌లో నివాసం ఉంటున్న కారంచేడుకు చెందిన మహిళ(35)తో ఓ కార్యక్రమంలో పరిచయం ఏర్పడింది. అది కాస్త సహజీవనానికి దారి తీసింది. దీనిని ఆసరాగా చేసుకున్న శ్రీతేజ ఆ మహిళ నుంచి రూ.20 లక్ష లు తీసుకొని వాడుకున్నాడు. తన డబ్బు తిరిగి ఇవ్వకపోగా, తన పిల్లలను సైతం ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యా దు చేసింది. గతంలోనూ ఓ మహిళ తనను మోసం చేశాడని శ్రీతేజ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసింది.