ముంబై(నమస్తే తెలంగాణ): తెలంగాణలో అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను మహారాష్ట్రలో అమలు చేయాలని బీఆర్ఎస్ పార్టీ నాగపూర్ విభాగ సమన్వయకర్త చరణ్వాగ్ డిమాండ్ చేశారు. భండరా జిల్లా తుమసర్ పట్టణంలో సోమవారం వేలాది మంది రైతులు, గిరిజనులు, వ్యవసాయ కూలీలతో కలిసి రెవెన్యూ డివిజన్ అధికారి తేలేకి వినతిపత్రం అందించారు.
ఈ సందర్భంగా చరణ్వాగ్ మాట్లాడుతూ.. మహారాష్ట్రలోని రైతులకు తెలంగాణలో అమలు చేస్తున్న విధంగా ఎకరాకు రూ.10వేలు, 24 గంటల ఉచిత విద్యుత్తు, రూ.5 లక్షల రైతు బీమా, గిరిజన బంధు, దళిత బంధు పథకం, చేనేత కార్మికులకు, బీడీ కార్మికులకు రూ.2 వేల పింఛను అమలు చేయాలని కోరారు.