హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : రంజాన్ మాసం పేరుతో పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్ష వేళలను మార్చడాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) తప్పుబట్టింది.
ఎండకాలం ఒంటిపూట బడులు నిర్వహించాల్సింది పోయి మిట్ట మధ్యాహ్నం, భోజన విరామం లేకుండా పరీక్షలు నిర్వహించడం అవివేకమని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి మాచర్ల రాంబాబు మండిపడ్డారు.