హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని 1 నుంచి 9 తరగతి వరకు విద్యార్థులకు నిర్వహించే సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ) -2 పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకొన్నట్టు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రాధారెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులిచ్చారు. గత షెడ్యూల్లో 8 ,9 తరగతులకు భౌతికశాస్త్రం, జీవశాస్త్రం పేపర్లకు వేర్వేరు రోజుల్లో పరీక్షలను నిర్వహిస్తామని ప్రకటించారు. తాజాగా, ఈ రెండింటి పరీక్షలను ఒకేరోజు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ నెల 19న ఆప్షనల్ హాలిడే ఉంటే 18న పరీక్షలు జరుపాలని సూచించారు.