హైదరాబాద్, జూన్ 12 (నమస్తే తెలంగాణ): ఎస్సీ గురుకుల సొసైటీ పరిధిలోని రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీల పనివేళలు మార్చారు. ఈ మేరకు సొసైటీ ఉన్నతాధికారులు వెల్లడించారు. ప్రస్తు తం ఉదయం 9నుంచి సాయంత్రం 4:30వరకు డిగ్రీ కాలేజీలు కొనసాగుతున్నాయి. తాజాగా ఆ పనివేళలను ఉద యం 9:30నుంచి సాయంత్రం 4 వరకే పరిమితం చేశారు. పాఠశాల విద్యకు సంబంధించి పనివేళలు ఉండటంతో గురుకుల డిగ్రీకాలేజీల్లో చేరేందుకు వి ద్యార్థులు సుముఖత చూపడం లేదని, ఈ నేపథ్యంలో పనివేళలు మార్చాలని సుదీర్ఘకాలంగా అధ్యాపకులు కోరుతున్నారు. అందుకు అనుగుణంగా సొసైటీ ఉన్నతాధికారులు తాజాగా నిర్ణయం తీసుకున్నారని తెలుస్తున్నది.