హైదరాబాద్, మార్చి 5 (నమస్తే తెలంగాణ): అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్స్పెక్టర్ (ఏఎంవీఐ) దరఖాస్తుల సవరణకు ఈ నెల 9 నుంచి 11 వరకు అవకాశం ఇస్తున్నట్టు టీఎస్పీఎస్సీ సెక్రటరీ అనితా రామచంద్రన్ తెలిపారు. దరఖాస్తులో తప్పులు దొర్లితే https:// www.tspsc.gov.in వెబ్సైట్ ద్వారా సవరణ చేసుకోవాలని సూచించారు. అయితే, సవరణకు సంబంధించిన ఆధారాలను పీడీఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయటం తప్పనిసరి అని చెప్పారు.
సందేహాలుంటే 040 23542185, 23542187 నంబర్లలో, లేదా helpdesk@tspsc. gov.in మెయిల్లో సంప్రదించాలని సూచించారు. రవాణా శాఖలో 113 ఏఎంవీఐ ఉద్యోగాలకు గత ఏడాది డిసెంబర్ 31న టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు ఏప్రిల్ 23న రాత పరీక్ష నిర్వహించనున్నారు.