హైదరాబాద్, జూన్ 14 (నమస్తే తెలంగాణ): మంత్రివర్గంలో కొత్తగా చేరిన ముగ్గురు మంత్రులకు సచివాలయంలో చాంబర్లు కేటాయించారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ (జీఏడీ)శనివారం ఉత్తర్వులు జారీచేసింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కు మొదటి అంతస్థులోని 13, 14, 15, 16 నంబర్ గదులను కేటాయించారు. వివేక్ వెంకటస్వామికి సెకండ్ ఫ్లోర్లో 20, 21, 22 నంబర్ గదులు, వాకిటి శ్రీహరికి అదే అంతస్థులో 26, 27, 28 నంబర్ గదులు కేటాయించారు. కాగా అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు ఎస్సీ అభివృద్ధి, గిరిజన, మైనారిటీ సంక్షేమం, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్లు, ట్రాన్స్జెండర్ల సాధికారత శాఖలు కేటాయించగా. వివేక్ వెంకటస్వామికి కార్మిక, ఉపాధి, శిక్షణ, ఫ్యాక్టరీలు, మైనింగ్, జియాలజీ శాఖలు, వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, పాడి అభివృద్ధి, క్రీడలు, యువజన సేవలు కేటాయించిన సంగతి తెలిసిందే.