హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ టూరిజం కార్పొరేషన్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్,అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలు పరిషరించాలని టూరిజం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు చాడా వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి సబ్బు రాజమౌళి డిమాండ్ చేశారు.
ఈ మేరకు మంగళవారం టూరిజం ఎండీ వల్లూరు క్రాంతిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చాడ వెంకటరెడ్డి మాట్లాడారు. కార్యక్రమంలో ఉడుత రమేశ్, పొంగలి శ్రీను, మనోహర్, మౌలాలి పాల్గొన్నారు.