హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : వారంతా సింగరేణి కార్మికులు. ఒకరికి కాలు లేదు. మరొకరికి ఓపెన్ హార్ట్ సర్జరీ అ య్యింది. ఇంకొకరికి పక్షవాతం. మరొకాయన బయటకెళ్లాలంటే మూత్రం పైపు పెట్టుకోవాల్సిందే. ఇంతటి దయనీయస్థితిలో ఉన్నా, సింగరేణి యాజమాన్యం మనసు కరగటం లేదు. ఈ విపత్కర పరిస్థితులను కండ్లార చూసినా ఇసుమంతైనా కనికరమనిపించలేదు. మంచం పట్టిన కార్మికులను మెడికల్ బోర్డుకు పిలిచి ఫిట్ ఫర్ డ్యూటీ అని సర్టిఫికెట్లు చేతిలో పెట్టారు. మీ ఆరోగ్యం ఎలా ఉంటే మాకేంటి. డ్యూటీకి రావాల్సిందేనంటున్నారు. దీంతో బా ధిత కార్మికుల కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తుండగా.. మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అండగా నిలిచారు. ఆయా కార్మికులను వెంటబెట్టుకుని శనివారం రెడ్‌హిల్స్‌లోని సింగరేణి భవన్‌కు వచ్చారు. సంస్థ పర్సనల్ అండ్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ గౌతమ్‌ను కలిసి కార్మికుల స్థితిగతులను కండ్లకు కట్టినట్టు వివరించారు. వారందరికీ న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కాలు లేదు.. పని చేసేదెలా?
1992 నుంచి సింగరేణిలో ఉద్యోగం చేస్తున్నా. అడ్రియాలలో ఆపరేటర్‌గా పనిచేశాను. హార్ట్ సర్జరీ అయ్యింది. రెండు స్టంట్లు వేశారు. యాక్సిడెంట్ అయ్యి కన్ను కనిపించడం లేదు. ఒక కాలు కట్ చేశారు. నడవటం ఇబ్బందిగా ఉన్నది. ఇన్ని సమస్యలతో పనిచేయ లేకపోతున్నా. మెడికల్ బోర్డుకు వెళ్తే ఫిట్నెస్ సర్టిఫికెట్ ఇచ్చారు. వెళ్లి డ్యూటీ చేయమంటున్నారు. డాక్టర్లే ఆరు నెలలు బెడ్ రెస్ట్ తీసుకోమన్నారు. మళ్లీ వాళ్లే ఫిట్ సర్టిఫికెట్ ఇచ్చారు. ఇదెక్కడి న్యాయం.
– తోట ఐలయ్య, సింగరేణి కార్మికుడు
న్యాయం కోసం ఉద్యమిస్తాం
నవంబర్ 25న నిర్వహించిన మెడికల్ బోర్డులో అనేక అక్రమాలు జరిగాయి. అన్‌ఫిట్ చేయాల్సిన కార్మికులను ఫిట్ చే యడం దారుణం. బైపాస్ సర్జరీ, మూడు స్టంట్లు పడ్డవారు, బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురైనవారు, కాళ్లు, కండ్లు లేనివారిని ఫిట్ ఫర్ డ్యూటీ అని సర్టిఫికెట్ ఇవ్వడం అన్యా యం. యాజమాన్యం చర్యలను సింగరేణి కార్మికలోకం వ్యతిరేకిస్తున్నది. మెడికల్ బోర్డుకు మొత్తం 129 మందిని పిలిస్తే 24 మందిని మాత్రమే అన్‌ఫిట్ చేశారు. తక్షణమే బాధితులకు న్యాయం చేయాలి.
– మిర్యాల రాజిరెడ్డి,టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు
ఇంత దుర్మార్గమా?
నాది గోదావరిఖని. నాకు గుండె ఆపరేషన్ అయ్యింది. పక్షవాతంతో మంచం పట్టాను. కుడి చెయ్యి లేస్తలేదు. నేను నిలబడలేకపోతున్నా. కట్టె పట్టుకొని నాలుగు అడుగులేస్తున్నా. ఇలాంటి నాకు మెడికల్ బోర్డు ఫిట్ సర్టిఫికెట్ ఇచ్చింది. ప్రతిరోజూ డ్యూటీ చేయమంటున్నారు. ఆఫీసర్లు దయతలిచి నా కొడుక్కు ఉద్యోగం ఇవ్వాలి.
– రాజలింగు, కార్మికుడు, గోదావరిఖని
ఇంతకన్నా ఘోరం మరోటి ఉంటుందా?
మాది శ్రీరాంపూర్. 2018లో శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయితే సింగరేణి దవాఖానకు పోతే ఫిట్ అని రాసిచ్చారు. డ్యూటీ చేస్తుండగానే గుండెపోటు వచ్చింది. ఓపెన్ హార్ట్ సర్జరీ అయ్యింది. అయినా డ్యూటీ చేయమంటున్నరు. ఏడు నెలలు సగం జీతమే ఇచ్చిండ్రు. న వంబర్‌లో ఫిట్ సర్టిఫికెట్ ఇచ్చిండ్రు. చనిపోయే స్థితిలో ఉంటే డ్యూటీ చేసేదెట్లా? ఇదెక్కడి ఘోరం?. – జీ సదానందం, కార్మికుడు, శ్రీరాంపూర్