హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): అమెరికాలో మూడేండ్ల వర్క్ పర్మిట్ లభించే ట్విన్నింగ్ ప్రొగ్రామ్‌లో ప్రవేశాలకు ఆశావాహుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు నోట్రీ డ్యామే డీ న్యామర్ యూనివర్సిటీ డీన్ జాన్ విట్చ్, ఎడ్యు టూ టెక్ సంస్థ సీఈవో హరికాంత్ తెలిపారు. ఇందులో చేరిన వారు ఎంబీఏను ఒక ఏడాది భారత్‌లో, మరో ఏడాది యూఎస్‌లో చదవొచ్చని తెలిపారు.
సోమవారం హైదరాబాద్‌కు వచ్చిన జాన్ విట్చ్ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటికే ఎంబీఏలో మొదటి సంవత్సరం పూర్తిచేసిన వారు ట్విన్నింగ్ ప్రోగ్రాంలో చేరవచ్చని సూచించారు. బీకాం, బీబీఏ విద్యార్థులు రెండేండ్లు ఇండియాలో, చివరి సంవత్సరం ఎన్డీఎన్యూ వర్సిటీలో చదవొచ్చని తెలిపారు. అక్టోబర్ 30 లోపు దరఖాస్తు చేసుకోవాలని, వివరాలకు 99597 42565 నెంబర్‌ను సంప్రదించవచ్చని తెలిపారు.