గుడిహత్నూర్, జూన్ 22 : ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోగల బాలింతల గదిలో ఆదివారం ప్రమాదవశత్తు సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. పక్కనే ఉన్న రెండు రోజుల పసికందు తలకు గాయమైంది.
రెండు రోజుల క్రితం కొద్దుగూడ గ్రామానికి చెందిన మహిళ ఆడ శిశువుకు జన్మనిచ్చింది. దవాఖానలోని బెడ్‌పై తల్లీపాప పడుకొని ఉండగా ఈ ఘటన జరిగింది. పసికందుకు గాయాలు కావడంతో జిల్లా కేంద్రంలోని రిమ్స్‌కు తరలించారు. ఈ ఘటనతో దవాఖానలోని రోగులు, సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు.